Qatar convicts Dutch tourist who says she was raped

Woman fined and deported from qatar in adultery case

Qatar, Dutch woman, adultery case, Doha court, woman deported, qatar, adultery case, 140 lashes, Laura, 3,000 Qatari riyals, Omar Abdullah al-Hasan, illicit sex, drinking alcohol

Qatar is to deport a Dutch woman who was convicted of adultery and given a one-year suspended sentence after she reported being raped while on holiday in Doha.

అక్కడ అక్రమ సంబంధం భయటపడితే.. అంతేమరీ..!

Posted: 06/16/2016 08:41 AM IST
Woman fined and deported from qatar in adultery case

పురుషాధిక్య సమాజానికే అధిక విలువనిచ్చి. మహిళలను బానిసలుగా చూసే తత్వం కలిగిన ఆ దేశాలలో తప్పులకు మాత్రం కఠిన శిక్షలు తప్పవు. ఎంతలా అంటే మగవాడు చెప్పింది విని.. వాడు నేరం చేశానని అంగీకరిస్తే చాలు ఇక మహిళలకు కూడా శిక్షలు విధించేస్తారు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకొందన్న ఆరోపణలు రుజువు కావడంతో డచ్ మహిళకు ఖతార్ కోర్టు రూ. 53వేల జరిమానా, దేశ బహిష్కరణ శిక్ష విధించింది.

ఆమె జరిమానా చెల్లించిన వెంటనే దేశం నుంచి పంపేస్తామని కోర్టు అధికారులు తెలిపారు. అయితే.. తాను అత్యాచారానికి గురైనట్లు ఆమె ఆరోపించింది. తనపై మోపిన ఆరోపణలను ఆమె ఖండించింది. సిరియాకు చెందిన ఒమర్ అబ్దుల్లా అల్ హసన్ అనే వ్యక్తికి ఆమెతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కోర్టులో రుజువైంది. దాంతో అతడికి వివాహేతర  సంబంధం పెట్టుకున్నందుకు 100 కొరడా దెబ్బలు, మద్యం తాగినందుకు మరో 40 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు.

అతడు శిక్ష అనుభవించేందుకు తగినంత ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. బాధితురాలు ఖతార్ వదిలి వెళ్లేందుకు తమ రాయబార కార్యాలయం ఆమెకు సాయం చేస్తుందని ఖతార్‌లో డచ్ రాయబారి కోర్టు వద్ద మీడియాకు చెప్పారు. బాధితురాలు ఒక పార్టీకి వెళ్లినపుడు డాన్స్ చేస్తోందని, కాస్త డ్రింక్ తాగిన తర్వాత తనకు డ్రగ్స్ ఎక్కించినట్లు ఆమెకు అర్థమైందని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. మర్నాటి ఉదయం తనకు ఏమాత్రం తెలియని ఒక అపార్టుమెంటులో ఉందని, అప్పుడే తాను అత్యాచారానికి గురైనట్లు ఆమెకు అర్థమైందని అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Qatar  Dutch woman  adultery case  Doha court  woman deported  

Other Articles