Diesel Price Hiked By Rs. 1.26/Litre, Petrol By 5 Paise/Litre

Petrol diesel prices go up yet again

Petrol price,Diesel price,Global oil price,IOC,Bharat Petroleum,Hindustan Petroleum Corporation,Fuel price,Petrol price hike,Diesel price hike

Petrol, diesel prices have gone up once again. This is the second. While petrol will cost 5 paise more per litre, diesel will be dearer by Rs 1.26.

పెరిగిన ఇంధన ధరలు.. ఎగబాకుతున్న నిత్యాసవరాల ధరలు

Posted: 06/16/2016 07:51 AM IST
Petrol diesel prices go up yet again

ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను అంటుకుంటున్న నేపథ్యంలో వాటి ధరను అమాంతం పెంచేందుకు దోహదపడే నిర్ణయాలకు కేంద్రం ఇంధన శాఖ అమోదం తెలుపింది. ఒక వైపు టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం పెరుగడం కేంద్రాన్ని అందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 5 పైసలు చొప్పున పెరుగగా... డీజిల్ పై లీటర్ కు రూ.1.26 పైసలు పెరిగింది. ప్రస్తుతం సవరించిన ధరలు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

సవరించిన ధరల తర్వాత రాజధాని నగరంలో పెట్రోల్ లీటరుకు రూ.65.65 పైసలు కాగా, డీజిల్ లీటర్ ధర రూ.55.19 పైసలకు చేరినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రతినెలా ఒకటి, 16 తేదీల్లో ధరలను సవరించడంలో భాగంగా ప్రస్తుతం మరోసారి ధరలు పెరిగాయి. ఏప్రిల్ 16 నుంచి ఇప్పటివరకూ పెరిగిన ధరలను బట్టి చూస్తే, పెట్రోల్ పై లీటరుకు రూ.9.04 పైసలు పెరుగగా, మార్చి నెలనుంచి డీజిల్ లీటరుకు రూ.11.05 పైసలు పెరిగింది. పెరిగిన ఢీజల్ ధరల నేపథ్యంలో రవాణ శాఖపై ప్రభావం పడి నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం వుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  price hike  dissel hike  IOC  Central Government  

Other Articles