Former Karnataka CM Yeddyurappa accused of influencing murder probe

Bs yeddyurappa in row over phone call to hassan sp

Former Karnataka CM, Yeddyurappa, Emmanuel Varun, yeddyurappa hassan sp video, Yeddyurappa controversy, Yeddyurappa video viral, BS Yeddyurappa, influencing murder probe

BJP Karnataka President B S Yeddyurappa has landed in a controversy after a video purportedly showing him telling a police official not to harass some Hindu youths in a murder case in Hassan district went viral.

ITEMVIDEOS: మరో వివాదంలో చిక్కుకున్న యడ్యూరప్ప..

Posted: 06/14/2016 11:54 AM IST
Bs yeddyurappa in row over phone call to hassan sp

ఇప్పటికే పలు వివాదాలు, కోర్టు కోసులలో ఇరుక్కుని తన ముఖ్యమంత్రి పదవిని కూడా పోగొట్టకుని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా అరోఫణలు ఎదుర్కోంటున్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప.. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హసన్ జిల్లాలోని అర్సికెరేలో జరిగిన ఒక మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థి హత్య కేసు విషయమై ఆ జిల్లా ఎస్పీని యడ్యూరప్ప ఫోన్‌లో బెదిరించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ యడ్యూరప్ప చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది.

కాగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేశ్ కాలప్ప తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసి.. ఈ కేసులో యడ్యూరప్ప పోలీసు బాస్ లపైనే ఒత్తడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యం తాను అప్ లోడ్ చేసిన వీడియోనేనని కూడా చెబుతున్నారు. ఆ హత్య కేసులో మీరు పలువురు హిందూ యువకులను అరెస్ట్ చేశారు. మరికొందరిని చిత్రహింసలు పెడుతున్నారు. ఇకపై ఇలాంటి పనులు చేయకపోతే మంచిది. లేకుంటే అర్సికెరేలో శాంతిభద్రతలు దెబ్బతింటాయి అని ఎస్పీ రాహుల్ కుమార్‌ను యడ్యూరప్ప హెచ్చరిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

యడ్యూరప్ప తన పలుకుబడిని ఉపయోగించి ఈ విధంగా హత్య కేసు దర్యాప్తును నీరుగార్చాలని చూస్తున్నారని కాలప్ప అన్నారు.. గత మే 29 న ఇమ్మానుయెల్ వరుణ్ అనే 24ఏండ్ల యువకుడిని కొందరు కత్తులతో పొడిచి చంపడంతో అర్సికెరేలో హింసచెలరేగింది. ఆ ప్రాంతంలో షాపులపై దాడి జరిగింది. హత్యకు సంబంధించి 11 మందిని, హింసాకాండకు సంబంధించి 13మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో కొందరు హిందూ గ్రూపులకు చెందినవారుండటంతో యడ్యూరప్ప కలుగజేసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles