locals beaten police consitables at lb nagar pr wines

Conistables misbehaved and manhandled young girl

lb nagar pr wines, young girl, police constables, drunken, conistables beaten, locals beaten conistables, conistables manhandling young girl, conistables beaten by locals, cyberabad police, crime

police conistables misbehaved and manhandled young girl at pr wines at lb nagar near kamineni hospital, locals given a befitting reply

మద్యం మత్తులో కానిస్టుబుళ్లు.. యువతితో..

Posted: 06/12/2016 07:56 AM IST
Conistables misbehaved and manhandled young girl

రాష్ట్రంలో కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వం ఆడపడచులకు అండగా నిలుస్తూ వారి కోసం కొత్తగా షీ టీమ్ లను ఏర్పాటు చేసి.. వారి తామున్నామన్న ధైర్యాన్ని అందిస్తుండగా, ప్రభుత్వ అదేశాలను తూగా తప్పకుండా పాటించాల్సిన రక్షక భటులు.. యమభటులుగా మారి ఆడపడచుకు నరకం చూపించారు. తాము పోలీసులమన్న అహంకారంతో విచక్షణ మరిచి ఓ యువతిపై దాడికి దిగారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కలగజేసుకొని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కామినేని సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికంగా ఉన్న పీఆర్ వైన్స్‌లో పీకల దాక తాగిన ఇద్దరు కానిస్టేబుళ్లు వైన్స్ ఎదుట తినుబండారాలు అమ్ముకుంటున్న సుమలత అనే మహిళపై దాడి చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా గోపి, అంబర్‌పేట్‌లో గ్రెహౌండ్స్ కానిస్టేబుల్‌గా సుధాకర్ పని చేస్తున్నారు.  ఈ రోజు సాయత్రం నుంచి వైన్స్‌లో తాగుతూ మద్యం మత్తులో యువతిని తీవ్రంగా కొట్టడంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీ టీవీ ఫూటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles