tollywood actor booked in drunk and drive case

Actor caught in drunk and drive ride at jubilee hills

tollywood actor sai rohith, actor sai rohith drunk and drive, actor sai rohith police, actor sai rohith car seize, actor sai rohith telangana police, actor sai rohith drunken, actor sai rohith jubilee hills kay raja kay actor sai rohith,

tollywood actor sai rohith arrested and his car seized as he was caught in drunk and drive ride at jubilee hills.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ నటుడు..

Posted: 06/05/2016 07:31 AM IST
Actor caught in drunk and drive ride at jubilee hills

హైదరాబాద్ రోడ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్రీగా చేద్దామని మహానగర పోలీసులు చేస్తున్న కృషి చాలా వరకు ఫలిస్తుంది. అయితే వీకెండ్స్ నేపథ్యంలో ఇంకా అక్కడక్కడా కొందరు పోలీసులకు పట్టుబడుతున్నారు. మహానగరంలో అక్రమంగా అర్థరాత్రిళ్ల వరకు పబ్, బార్ లు తెరచి పలువురు తమకు వ్యాపారమే ముఖ్యమన్నట్లు వ్యహవరిస్తున్న తరుణంలో తాగి రోడ్డుపైకి వచ్చేవారి సంఖ్య కూడా బడాబాబులవిషయంలో తగ్గుముఖం పట్టినట్టు లేదు. నగరంలోని జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రధాన కూడలిల్లో శనివారం అర్థరాత్రి పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు.

ఇప్పటికే అనేక మంది బడాబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడినా.. ఇంకా అరకోరగా బడాబాబులు పోలీసులకు చిక్కుతూనే వున్నారు. తాజాగా నిన్న జరిగిన తనిఖీలలో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. కాయ్ రాజా కాయ్ ఫేం సాయి రోహిత్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు. జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అతన్ని బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేయగా తాగి వాహనాన్ని నడిపినట్లు తేలింది. బ్రీత్ ఎనలైజర్‌లో 42 శాతం నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jubilee hills  Drunk and Drive  kay raja kay fame  actor sai rohith  car seize  police  

Other Articles