న్యూడ్ సిటీలు ఎన్నో.. ఎన్నెన్నో... | places people enjoying naked

Places people enjoying naked

nude places, naked places, naked people, nude people, places ban clothes, తాజా వార్తలు, తెలుగు వార్తలు, నగ్న నగరాలు, న్యూడ్ ప్రాంతాలు, నగ్న ప్రాంతాలు, బట్టలు లేని నగరం, latest news, telugu news, entertainment

If there's one problem with nude places, it's that you can't control who actually takes off their clothes. Also, sand gets everywhere. Even so, they're still better than regular places by virtue of one simple fact. Here is the some of places for you.

న్యూడ్ సిటీలు ఎన్నో.. ఎన్నెన్నో...

Posted: 06/04/2016 11:12 AM IST
Places people enjoying naked

మనిషికి కావాల్సిన మూడు విషయాలు తిండి, గుడ్డ, నీడ. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా బతకలేం. ఆదిమ కాలం నుంచి ఒక్కోక్కటిగా నేర్చుకుంటూ వస్తున్న మనిషి ముందుగా కూడు, ఆ తర్వాత నీడ ఆపై గుడ్డలను ఓ పద్ధతి ప్రకారం సమకూర్చుకుంటూ, అలవాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇందులో మొదటి రెండు లేకపోతే అడ్జస్ట్ కావొచ్చేమో గానీ, చివరిది లేకపోతే మాత్రం చాలా కష్టం. సపోజ్ పర్ సపోజ్ బట్టలు లేకుండా మనుషులు రోడ్లపై తిరిగితే ఎలా ఉంటుంది? ఊహించుకోలేం కదా! చెప్పులు లేకుండా వెళితేనే చిత్రంగా చూసే ఈరోజుల్లో దుస్తులు లేకుండా తిరిగే ప్రాంతాలున్నాయంటే నమ్ముతారా? ఎక్కువ ఓపెన్ మైండ్ తో ఉండే అక్కడి జనాలు ఇలాంటి రూల్స్ తో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అలాంటివి ప్రాంతాలు కొన్ని మీకోసం...

ఏరోపా ఖండంలోని జర్మనీలో ఉంది సిటీ పార్క్ ఆఫ్ మునిచ్. ఇందులోకి ప్రవేశించాలంటే ముందుగా ఒంటి మీద డ్రెస్ తీసేయాల్సిందే. అలా అయితేనే లోపలికి అనుమతిస్తారు. ఆడా, మగ, పిల్లా, ముసలి ఎవరైనా సరే అంతా ఇలా చేయాల్సిందే. లోపలికి వెళ్లాక ఎవరి ఇష్టానుసారం వారు ఎంజాయ్ చేయొచ్చు. ఇక మసాజ్ పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తోచ్చే పేరు బ్యాంకాక్. కానీ, మసాజ్ లకు పుట్టినిల్లు ఇండోనేషియాలోని బాలీ ద్వీపం అని ఎంత మందికి తెలుసు? ప్రకృతి అందాలకు నిలయమైన బాలీ ద్వీపానికి వచ్చేవారు సేదతీరేందుకు అక్కడి మసాజ్ సెంటర్ లకు క్యూ కడుతుంటారు. కానీ, అందులోకి వెళ్లాలంటే బట్టలు లేకుండా వెళ్లాల్సిందే. అంతేకాదు మసాజ్ చేయించునేంత వరకు నిర్వాహకులు తమ కెమెరాలతో ఆ తతంగం అంతా షూట్ చేస్తుంటారంట. ఇక మరో యూరప్ కంట్రీ అయిన ఆస్ట్రియాలో ఆర్ట్ ఫెస్టివల్ ఏటా జరుగుతూ ఉంటుంది. అయితే మాకేం అంటారా? ఆ ఫెస్టివల్ కు హాజరుకు వేలాది మంది నగ్నంగా హజరు అవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లు, ఆర్టిస్టులు తమ న్యూడ్ బాడీపై పెయింటిగ్స్ వేసుకుని మారథాన్ లో పాల్గొంటారు.

ఇక ఇప్పుడు చెప్పబోయేది ఓ ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఒక్కరోజో, లేక ఒక్క ప్రాంతంలోనో కాదు, ఏకంగా ఒక నగరం మొత్తం నగ్నంగా ఉంటుంది. ఫ్రాన్స్ లోని సిటీ కేప్ డి అనే సిటీలో ప్రజలు ఏడాది పొడవునా అలాగే ఉంటారంట. బట్టలు వేసుకోపోవటం, వేసుకోకపోవటం అనేది వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పరు. సాంకేతికపై ఎక్కువ ఆధారపడే జపాన్ లాంటి కంట్రీలో సాంప్రదాయాలకు ప్రజలు ఎక్కువగా విలువ ఇస్తారు. ఇక్కడ అన్సెన్ ఉండే ప్రాంతంలో ఓ కొలను ఉంది. దీని ప్ర్యతేకం ఏంటంటే... ఇందులో మినరల్స్ ఉంటాయని, వాటి ద్వారా రోగాలు దరిచేరవని వీరి నమ్మకం. కానీ, ఇందులో స్నానం చేయాలంటే మాత్రం గుడ్డలు విప్పేయాల్సిందే. చేయాలంటే నూలు పోగు కూడా ఉండకూడదనే నిబంధన వందల ఏళ్లుగా ఉందట. ఇవే కాదు ఇటలీలోని స్పియాగయా డి గువానో, గ్రీస్ లోని రెడ్, కెనడాలోని రెక్ లాంటి బీచ్ ల్లో బట్టలుంటే అనుమతించరంట. ఇవన్నీ విన్నాక మీకూ ఆయా ప్రాంతాలకు వెళ్లాలని తహతహాగా ఉందా? నిరభ్యరంతంగా వెళ్లొచ్చు. కానీ, కండిషన్స్ అప్లై.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naked places  nude cities  people without clothes  

Other Articles