oppositons attack kcr on telangana formatiom celebrations

Kcr another nero emperor in celebrations mode tweets digvijay singh

kcr, digvijaya singh, nero, telangana formation day celebrations, telangana cm kcr, farmers suicide, unemployement, Nero emperor, 100 crores ads, TRS, Congress, ysrcp, konda raghava reddy, mallu bhatti vikramarka

KCR celebrating and putting huge ads worth 100s of crores.Another Nero in the celebration mode when poor people are dying, tweets congress general secratary digvijay singh

కేసీఆర్ సంబరాలు నీరో చక్రవర్తిని గుర్తుతచేస్తున్నాయ్..

Posted: 06/02/2016 10:54 AM IST
Kcr another nero emperor in celebrations mode tweets digvijay singh

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు వందల కోట్ల రూపాయలతో ప్రతికలలో భారీ ప్రకటనలు ఇవ్వడం.. కోట్ల రూపాయలతో భారీ ఎత్తున నిర్వహించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఒక వైపు రైతులు అన్నమో రామచంద్రా అంటూ అంగలారుస్తుంటే.. కేసీఆర్ మాత్రం వారు కష్టాలు పట్టని నీరో చక్రవర్తిలా సంబరాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా వివిధ పత్రికలలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారని ఆయన అన్నారు.

బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పేద ప్రజలు, రైతులు బతకలేక, తమ కుటుంబాలను పోషించలేక బలంవంతంగా బలన్మారణాలకు పాల్పడుతుంటే.. నీరో చక్రవర్తిలా కేసీఆర్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ తీరు సిగ్గుచేటని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు.  గడిచిన రెండేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందడం మనమంతా చూశామని అన్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వడదెబ్బకు ప్రజలు పిట్టలా చనిపోతున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని అయినా వాటిపై దృష్టి సారించని కేసీర్ సర్కార్.. సంబరాలకు మాత్రం వందల కోట్లను ఖర్చు చేస్తుందని దుయ్యబట్టారు. అంతకుముందు ఆయన తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదించినందుకు, తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకరం చేసినందుకు దిగ్విజయ్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కూడా కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చినా.. ఇప్పటికీ తెలంగాణ అమరవీరుల విషయంలో నాన్చివేత దోరణి అవలంభిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ అమరులను తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 1,100 మంది ప్రాణత్యాగం చేస్తే.. ఇప్పటివరకు గుర్తించింది 300 మందినేనా? అని ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీలో చేర్పించాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్రస్‌లు ప్రభుత్వానికి దొరుకుతున్నాయి. కానీ.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల అడ్రస్‌లు మాత్రం ఇంకా దొరకడం లేదా అంటూ తూర్పారబట్టారు. మాటల గారడీతో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కలసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదెంతో కాలం సాగదని అన్నారు. కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు రిజర్వేషన్ హామీలన్నీ అటకెక్కాయన్నారు. వైఎస్సార్‌సీపీ అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజలకు అండగా పోరుబాట పడుతుందని అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  digvijaya singh  TRS  Congress  ysrcp  konda raghava reddy  mallu bhatti vikramarka  

Other Articles