YouTube video of 10-second corn challenge girl left bald by drill

Woman attempts corn drill challenge fails miserably

Woman attempting corn drill challenge, girl hair ripped off, corn drill challenge gone wrong, china girl fails corn challenge, corn drill challenge, china girls viral video,

The ‘corn drill challenge’ is a stunt that involves people eating corn from a rotating power drill.

ITEMVIDEOS: అచ్చిరాని ఛాలెంజ్ లకు వెళ్తే.. చిరిగి చాట అవుద్ది.. ఇలా.. !

Posted: 05/09/2016 10:39 PM IST
Woman attempts corn drill challenge fails miserably

సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారి సంఖ్య అకాశంలో తారల మాదిరిగా లేక్కనేనంత స్థాయికి చేరుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. టెలీ కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పులు, దాంతో పాటు అనుసంధానం చేయబడిన అంతర్జాలంతో ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. అందుకే ఎక్కడ ఏ వింత జరిగినా.. క్షణాలు మొదులుకుని కొన్న గంట్లల వ్యవధిలోనే ప్రపంచానికి తెలిసిపోతుంది, ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన పలు సవాళ్లను సెలబ్రిటీలు స్వీకరించి నిత్యం వార్తల్లో వుండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐస్ బకెట్ నుంచి మొదలుకుని పలువురు పలు వీడియోను అనుకరించే పనిలో వున్నారు. ఇలా చేయబోయిన చైనా మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పవర్ డ్రిల్ మెషిన్ సహాయంతో మొక్కజోన్న కంకిని వేగంగా తినడానికి ప్రయత్నించి జుట్టును పోగొట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో హల్ చల్ చేస్తుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల చైనా సోషల్ మీడియాలో 'కార్న్ డ్రిల్ చాలెంజ్' పేరుతో ఓ వీడియో బాగా పాపులర్ అయింది. డ్రిల్ మిషన్కు మొక్కజోన్న కంకిని జోడించి అది వేగంగా తిరుగుతున్న సమయంలో కేవలం 10 సెకన్లలో ఆ కంకిని తినేయడం ఆ వీడియోలో కనిపించింది. ఐస్ బకెట్ చాలెంజ్, నాజుకు నడుము అని తెలిపేందుకు ఏ4 పేపర్ చాలెంజ్ లాగే దీనిని కూడా యువత వెర్రిగా అనుకరిస్తున్నారక్కడ. దీనిలో భాగంగా ఓ గుర్తుతెలియని మహిళ అనుకరించే సమయంలో ప్రమాదవశాత్తు డ్రిల్ మిషన్లో జుట్టు ఇరుక్కుపోయింది. క్షణకాలంలో జరిగిన ఈ ఘటనలో మహిళ తల ముందుభాగంలోని జుట్టు ఊడిపోయింది.

దీంతో బట్టతల మాదిరిగా కనిపిస్తున్న ఆ మహిళకు డాక్టర్లు చికిత్స అందించారు. త్వరలోనే మళ్లీ జుట్టు వస్తుందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర చాలెంజ్లు అనుకరించొద్దని కొందరంటుంటే.. అది పూర్తిగా ఆ మహిళ తప్పిదమే అని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా చాలెంజ్తో ఇంత పాపులర్ అయ్యేదో కాదో తెలియదు కానీ.. ప్రమాదంతో మాత్రం సదరు మహిళ ఫుల్ పాపులర్ అయింది అంటున్నారు ఇంకొందరు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles