భార్య ఆ పనిని పట్టించిన టెక్నాలజీ | TECHIE TRAPS CHEATING WIFE AND GOT DIVORCE

Techie traps cheating wife and got divorce

Banglore, Techie, Divorce, బెంగళూరు, టెక్కీ, సిసికెమెరాలు

A 31-year-old software engineer from the city was sure that his wife was having an affair. But every time he confronted her, she would deny it. He eventually put his skills to use and proved her infidelity. The couple was recently granted divorce.

భార్య ఆ పనిని పట్టించిన టెక్నాలజీ

Posted: 05/09/2016 03:34 PM IST
Techie traps cheating wife and got divorce

ఈ మధ్యన పోలీసులు  టెక్నాలజీని బాగా వాడుకుంటూ క్రిమినల్స్ పని పడుతున్నారు. అయితే తాజాగా ఓ భర్త తన భార్యతో విడాకులు తీసుకునేందుకు టెక్నాలజీని వాడేసుకున్నాడు. అదేంటి విడాకులు తీసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవడం ఏంటా అని అనుకుంటున్నారా..? తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకోవడాన్ని టెక్నాలజీ సహాయంతో గుట్టు రట్టు చేశాడు. బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నవ్యక్తి తన భార్య చేస్తున్న పనిని సాక్షాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టాడు. దాంతో కోర్టు దాన్ని పరిగణించి విడాకులు ఇచ్చేసింది. ఇంతకీ ఆ సాఫ్ట్ వేర్ ఎలా టెక్నాలజీని వాడుకున్నాడో తెలుసా.?

తన భార్య మీద అనుమానం ఉన్న ఆ వ్యక్తి.. తన భార్య గురించి నిజాలు తెలుసుకునేందుకు ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశాడు. అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్ ను తన లాప్ టాప్ కు అనుసంధానం చేశాడు. ఆ భార్య తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీ చెవినపడ్డాయి. ఇక ఇంట్లో ఉన్న సీసీ కెమేరాలు లివింగ్ రూమ్ లో, బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన రాసలీలలన్నీ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలతో నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని అభ్యర్థించాడు. కోర్టు ఆ వీడియోలు నిజ‌మే అని నిర్ధారించి ఆ టెక్కీకి త‌న భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles