ఎంపీలందు శివప్రసాద్ వేరయా MP Shiva Prasad is different form other MPs

Mp shiva prasad is different form other mps

Shiva Prasad, Parliament, AP, MP Shiva Prasad, ఎంపీ శివప్రసాద్, పార్లమెంట్, ఏపి, ప్రత్యేక హోదా

Chittor MP Shiva Prasad is most special person in Parliament. He demand for special status for AP.

ఎంపీలందు శివప్రసాద్ వేరయా

Posted: 05/09/2016 03:10 PM IST
Mp shiva prasad is different form other mps

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని నాడు వేమన అన్నది అక్షరాల నిజమే. అందునా ఎంపీలందు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరింత వేరయా అని కూడా చెప్సుకోవచ్చు. ఆయన పార్లమెంట్ ఆవరణలో వేసే వేశాలు అన్ని ఇన్ని కాదు. తెలంగాణ‌కు వ్యతిరేకంగా స‌మైక్య ఉద్యమం అంటూ రోజుకో వేషంతో పార్ల‌మెంటు వ‌ద్ద‌, తిరుప‌తి, చిత్తూరుల‌లో చిత్ర విచిత్ర వేశాల‌తో మీడియా ముందు ఎంపీ శివ‌ప్రసాద్ వేసిన నాట‌కాలు అంద‌రం చూసిందే క‌దా. ఇప్పుడు అదే ఎంపీ కొత్త ఏశాలు మొద‌లువెట్టాడు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించే చేసింది. ఆంధ్రాకు ప్రత్యేక‌హోదా ఇవ్వాల‌ని, రాజ్యాంగాన్ని స‌వ‌రించి అయినా ప్రత్యేక హోదా త‌ప్పకుండా ఇవ్వాల‌ని, ఎంపీ శివప్రసాద్ కొత్తగా చెప్పారు. వంద‌సార్లు స‌వ‌రించిన రాజ్యాంగాన్ని ఇంకోసారి స‌వ‌రిస్తే త‌ప్పేం లేదంటూ శివ‌ప్రసాద్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వేషంలో పార్ల‌మెంటుకు వ‌చ్చాడు.  అయితే దీని మీద జనాలు మాత్రం వేరేలా అనుకుంటున్నారు. ఇన్ని వేషాలు వేసే బ‌దులు హోదా గురించి పార్లమెంటులో వాద‌న వినిపిస్తే బాగుంటుంది క‌దా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles