Upset over Bihar cooking ban, Nitish Kumar throws slipper at CM

Youth tries to throw chappal at nitish kumar arrested

nitish kumar, bihar, nitish kumar chappal, chappal thrown, chappal at nitish kumar, chappal thrown at nitish kumar, janata darbar

A youth allegedly tried to fling his chappal towards Bihar CM Nitish Kumar at a public interaction programme here but was arrested by the police.

ముఖ్యమంత్రిపై చెప్పుతో దాడి చేయబోయిన నితీష్ కుమార్

Posted: 05/02/2016 05:38 PM IST
Youth tries to throw chappal at nitish kumar arrested

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే 'జనతా కా దర్బార్‌' కార్యక్రమంలో ముఖ్యమంత్రికి నితీష్ కుమార్ కు పరాభవం ఎదురైంది. జనతా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఓ యువకుడు సీఎం నితీశ్‌ను చెప్పుతో కొట్టబోయాడు. దీంతో పోలీసులు అతన్ని అడ్డుకొని వెంటనే అరెస్టు చేశారు. యాదృచ్ఛికంగా ఆ యువకుడి పేరు కూడా నితీశ్‌కుమారే.

ఆర్వాల్ జిల్లాకు చెందిన అతను సీఎంను కలిసి, తన వినతిపత్రం ఇచ్చేందుకు 'జనతా కా దర్బార్‌'కు వచ్చాడు. సీఎం దగ్గరికి వెళ్లగానే అతడు ముందుకువంగి తన చెప్పును తీయబోయాడు. అతన్ని భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్టు చేసి, ప్రశ్నించేందుకు సచివాలయ పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు సీనియర్ ఎస్పీ మను మహారాజ్‌ తెలిపారు.

ప్రజల ఫిర్యాదులు స్వీకరించి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తన అధికారిక నివాసంలో 'జనతా కా దర్బార్‌మే ముఖ్యమంత్రి' కార్యక్రమాన్ని నితీశ్‌కుమార్ నిర్వహిస్తున్నారు. గతంలో అప్పటి డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ 'జనతా కా దర్బార్‌' కార్యక్రమం నిర్వహించిన సందర్భంలోనూ ఈ యువకుడు రచ్చ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Bihar  janata durbar  throw slipper  

Other Articles