BJP MP Hema Malinis car hit by another vehicle in her convoy

Bjp s hema malini escapes unhurt after accident in up

Hema Malin accident, Hema Malini cavalacade collision, bollywood, bjp MP, Narrow Escape, road accident,

Actor-turned-politician Hema Malini today had a narrow escape as two vehicles in her cavalcade collided with each other under Highway police station area in Mathura, police said.

బీజేపి ఎంపీ, సినీనటికి తృటిలో తప్పిన ప్రమాదం..

Posted: 05/01/2016 09:35 AM IST
Bjp s hema malini escapes unhurt after accident in up

ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి పెద్ద గండం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు వెనకాలే సెక్యూరిటీగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అందులో ఒక కారు హేమ కారును తాకుతూ ముందుకు వెళ్లి ఆగి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మధురలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అదృష్టంకొద్ది ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు హేమ మాలిని బానే ఉన్నారని ప్రకటన చేశారు.

దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వెటర్నరీ యూనివర్సిటీ, గావ్ అనుసంధాన్ కేంద్ర ప్రారంభకార్యక్రమాలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 'ఎంపీ హేమమాలిని ప్రయాణిస్తున్న కారు వెనుకాలే రక్షణగా వస్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ చేయగా అందులోని ఒక కారు హేమ ఉన్న కారును తాకుతూ ముందుకు వెళ్లింది. అయితే హేమకు ఎలాంటి నష్టం జరగలేదు' అని పోలీసులు చెప్పారు. గత ఏడాది రాజస్థాన్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కూడా ఎంపీ హేమమాలని అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ ఐదేళ్లపాప చనిపోగా అందుకు అమె తండ్రి నిర్లక్ష్య వైఖరే కారణమని హేమమాలిని కోలుకున్న తరువాత వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hema Malini  bollywood  bjp MP  Narrow Escape  road accident  

Other Articles