Trinidad’s Iraq Thomas Blows Away Chris Gayle’s Record of Fastest T20 Ton

100 in 21 balls iraq thomas hits fastest ever century

Chris Gayle, T20 cricket, Trinidad cricketer, Iraq Thomas, T20 fastest century, Cricket latest Cricket news

Iraq Thomas took just 21 balls to score a century in a T20 match played in Trinidad and Tobago. Chris Gayle had the record for the fastest T20 hundred scored off 30 balls

టీ-20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు..

Posted: 04/29/2016 03:46 PM IST
100 in 21 balls iraq thomas hits fastest ever century

సంచలనాలకు మారు పేరైన టి20 క్రికెట్‌లో మరో మెరుపు రికార్డు నమోదైంది. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో బ్యాట్స్‌మన్ ఇరాఖ్ థామస్ ఈ రికార్డును తన పేరును రాసుకున్నాడు. ఇప్పటికే విధ్వంసకర బ్యాట్స్ మెన్లు అధికంగా వున్న వెస్టీండీస్ లో మరో మెరుపు బ్యాట్స్ మెన్ పుట్టుకోచ్చాడు. తన అద్భుమైన బ్యాటింగ్‌తో 21 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. బౌలర్ ఎవరన్నది పట్టించుకోకుండా తన దృష్టంతా కేవలం బంతిమీద పెట్టి.. వచ్చిన బంతులను బౌండరీలు దాటించాడు, అంతే తన విధ్వంసకరమైన బ్యాటింగ్ ముందు బౌలర్లు తేలిపోయారు. ఇంతలో ఇరాఖ్ థామస్ తన పేరున ఫాస్టెట్ టీ20 సెంచరీని నమోదు చేశాడు.

టి20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే కావడం విశేషం. మ్యాచ్ ముగిసేసరికి 23 ఏళ్ల ఇరాఖ్ 31 బంతుల్లోనే 15 సిక్సర్లు, 5 ఫోర్లతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గతంలో ట్రినిడాడ్ జట్టులో అండర్-13 స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అతను, జాతీయ అండర్-19 ప్రాబబుల్స్‌లో కూడా ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణేపై క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఇరాక్ థామస్ చెరిపేసి.. 21 బంతులో శతకాన్ని బాది తన పేరున రికార్డు లిఖించుకున్నాడు.

టొబాగో క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీలో స్కార్‌బారో తరఫున బరిలోకి దిగిన అతను, స్పీ సైడ్ టీమ్‌పై ఈ ఘనత సాధించాడు. కాగా ఈ రికార్డును ఇప్పట్లో బద్దలు కోట్టే అవకామే లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే వరుసగా 20 బంతుల్లో పది ఫోర్లు, పది సిక్స్ లతో రాణించాల్సి వుంటుంది. అయితే ఇరాఖ్ థామస్ మాత్రం కేవలం ఒక్క బంతిని అధికంగా వాడి ఈ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T20 cricket  Trinidad cricketer  Iraq Thomas  chris gayle  

Other Articles