TPCC to Field Ramreddy's Widow for Palair Assembly Bypoll

Ramreddy venkat reddy wife sucharita to contest palair by elections

TPCC, palair assembly constituency, election, Congress candidate Ram Reddy sucharitha, AICC president, sonia gandhi, uttam kumar reddy, rahul gandhi, khammam by election, cpi, CPM, tammineni Veerabhadram, Telangana TDP

TPCC decided to field Sucharitha Reddy, widow of Congress MLA Ramreddy Venkat Reddy, who passed away recently, for the Palair Assembly bypolls in Khammam district.

రాంరెడ్డి సుచరితను బరిలోకి దింపిన కాంగ్రెస్.. మద్దతివ్వం అన్న సీపీఎం

Posted: 04/24/2016 03:14 PM IST
Ramreddy venkat reddy wife sucharita to contest palair by elections

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి పోటీ చేయనున్నారు. సుచరితారెడ్డిని బరిలోకి దించితేనే ఇతర పార్టీలు మద్దతుతో విజయం సాధిస్తామని రాంరెడ్డి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమె పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ పీసీసీకి పంపారు. దీంతో టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాంరెడ్డి కుటుంబీకులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి రాంరెడ్డి సుచరితకు టికెట్ ఇవ్వాలని ఏఐసిసికి.. టీపీసీసీ సిఫారసు చేసింది. వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు సుచరిత పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ... ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. పాలేరులో దివంగత ఎమ్మెల్యే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు,
 
దీంతో పాటు అయన పలు మిత్రపక్షాలకు కూడా లేఖ రాశారు. రాంరెడ్డి సతీమణినే బరిలోకి దింపుతుంన్నందున.. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని పలు పార్టీలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీటీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు కూడా ఆయన లేఖలు రాశారు. పాలేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించారని... దీంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ అవకాశం ఇస్తోందని లేఖల్లో పేర్కొన్నారు. అందువల్ల పాలేరులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

కాగా, తమ పార్టీ పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని శనివారం ఆయన విలేకరులకు చెప్పారు. పాలేరులో అసాధారణ పరిస్థితులు లేనందున ఏకగ్రీవం లేదా ఇతర చర్యలకు ఆస్కారం లేదన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తమను కలిసినపుడు కచ్చితంగా పోటీచేస్తామని చెప్పామన్నారు. ఈ ఎన్నికలో మద్దతునివ్వాలని ఇప్పటికే సీపీఐని కోరినట్లు, ఆదివారం జిల్లాపార్టీ కార్యవర్గసమావేశంలో దీనిపై నిర్ణయిస్తామని వారు చెప్పారన్నారు. న్యూడెమోక్రసీకీ లేఖలు రాశామని 2 రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles