Babulal Gaur at it again? Caught on cam touching woman inappropriately

Mp minister babulal gaur touching woman inappropriately

babulal gaur, babulal gaur video, babulal gaur woman, babulal gaur touches woman, video of babulal gaur, Babulal Gaur touching a woman inappropriately

As the place was crowded I was asking the women to move fast. Baseless allegations are being made against me," the former Madhya Pradesh chief minister argued.

ITEMVIDEOS: అడవారి పట్ల మంత్రి అభ్యంతరకర చేష్టలు.. మండిపడుతున్న నెట్ జనులు

Posted: 04/21/2016 10:17 PM IST
Mp minister babulal gaur touching woman inappropriately

వంటిపైకి వయస్సు రాగానే సరిపోదు.. ఎవరితో ఎలా మెలగాలో కూడా తెలియాలి. అన్న డైలాగు అప్పుడప్పుడూ మనకు వినబడుతూనే వుంది, ఇప్పుడిదే డైలాగ్ సోషల్ మీడియాలోనూ హట్ టాపిక్ గా మారింది. మనం ఓట్లు వేస్తే గెలిచిన నాయకులకు అదికారంలోకి వచ్చాక మనమంటే ఎంత ప్రేమో చూడండీ.. అంటూ కొందరు, తన కూతురు కన్నా తక్కువ వయస్సున్న వారితో ఇలానేనా ప్రవర్తించేదని, మరికొందరు, ఇక మరికోందరు మరోలా అనేక మంది అనేక విధాలా అయనను అడిపోసుకుంటున్నారు. ఎందుకంటారూ..? అసలు ఆయన ఎవరు.?

ఆయన మరెవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్న వ్యక్తి, ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఆయన వయస్సు ప్రస్తుతం 85 ఏళ్లు. ఆయనోవరో కాదు మంత్రి బాబులాల్ గౌర్. తన మనవరాలి వయస్సున ఓ మహిళ పట్ల నలుగురిలోనూ ఆయన అసభ్యంగా తాకారనే వివాదం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పెనుదుమారం రేపుతున్నది. బాబూలాల్ గౌర్ మహిళను అసభ్యంగా తాకుతున్నట్టు కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో పెద్ద వివాదమే రేపుతున్నది.

అయితే మంత్రి బాబూలాల్‌ ఆ వీడియోలో ఏమాత్రం నిజం లేదని, తానెలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. ఆయన గురువారం బార్‌ఖేదా నాథ్‌ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలు బస్సు ఎక్కుతున్న సందర్భంగా ఆయన ఓ మహిళను వెనుకవైపు నుంచి చేయితో కొట్టడం కెమెరా కంటికి చిక్కింది. ఆయన కావాలనే మహిళను తాక్కినట్టు ఈ వీడియోలో కనిపించడం సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్‌ న్యూస్‌ చానెళ్లలోనూ ఇదే వివాదం ప్రముఖంగా  ప్రసారమవుతున్నది.
 
అయితే ఈ వివాదంపై స్పందించిన మంత్రి బాబూలాల్‌ 'మహిళలు తొందరగా బస్సు ఎక్కేలా నేను ప్రోత్సహించాను. వాళ్ల కోసమే నేను ఇది చేశాను. అంతేకానీ వీడియోలో కనిపించినదానిలో నిజం లేదు' అని వివరణ ఇచ్చారు. అయితే 85 ఏళ్ల బాబూలాల్‌కు వివాదాలు కొత్త కాదు. తనదైన పంచ్ డైలాగులతో కామెంట్లు చేసి గతంలోనూ ఆయన బీజేపీని ఇరకాటంలో నెట్టారు. పదిసార్లు ఎమ్మెల్యే అయిన బాబూలాల్ మద్యం తాగడం ప్రజల మౌలిక హక్కు అని, స్టేటస్ సింబల్ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babulal Gaur  woman  Caught on camera  barkheda nathu area  bhopal  madhya pradesh  

Other Articles