Maharashtra minister Pankaja Munde faces flak over 'drought selfie'

Pankaja munde clicks drought selfie in latur

Maharashtra drought, Pankaja Munde, drought selfie,Latur, Marathwada, latur, latur drought, marathwada drought, drought hit region, water conservation minister pankaja munde,

Maharashtra Minister for Water Conservation Pankaja Munde landed in trouble after she took selfies in drought-hit Latur district

కరువు కన్నీళ్లకు.. అమాత్యుల సెల్పీలు సమాధానమా..?

Posted: 04/18/2016 10:40 AM IST
Pankaja munde clicks drought selfie in latur

మహారాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి పంకజా ముండే మరో వివాదంలో చిక్కుకున్నారు. కరువుతో అల్లాడుతున్న లాతూరు జిల్లాలో పర్యటించిన ఆమె మంజీరా నది పునరుద్దరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అమె సెల్ఫీ తీసుకుని ట్విటర్ లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్నదాతలు నీరు లేక కన్నీళ్ల పర్యంతం అవుతుంటే.. కరువు పీడత ప్రాంతాలను పర్యటించి మంత్రి.. రైతుల పరిస్థిని చూసి నవ్వుతున్నారా..? లేక అన్నదాతలపై అమాత్యురాలికి వున్న ప్రేమ ఇదేనా..? అని విపక్షాలు మండిపడతున్నాయి.

Also Read: నీళ్ల కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోకతప్పదా..?

లాతూరు జిల్లా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆమె పూర్తిగా ఎండిపోయిన మంజీరా నది పునరుద్ధరణకు సియా గ్రామం వద్ద ప్రభుత్వం చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నది ఒడ్డున నిలబడి తన సెల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నారు. అయితే అక్కడున్న దీన పరిస్థితులను అర్థం చేసుకోకుండా నవ్వూతూ సెల్పీ తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కరువు ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటారా అంటూ మంత్రిపై  నెటిజన్లు మండిపడ్డారు.

Also Read: నీరే జీవనాధారం.. నీరే జీవితం


నెట్ జనుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, అటు విపక్షాలు కూడా మండిపడుతుండటంతో వెంటనే స్పందించిన అమాత్యురాలు.. మంజీరా నది పనుల పర్యవేక్షణకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి నెటిజన్లను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మంజీరా నది పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. పంకజ సెల్ఫీపై మిత్రపక్షం శివసేన స్పందించింది. కరువు ప్రాంతం లాతూరులో సెల్ఫీ తీసుకోవడం దురదృష్టకరమని, ఇలా చేసుండాల్సింది కాదని వ్యాఖ్యానించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra minister  Pankaja Munde  drought selfie  latur  maratwada  

Other Articles