Banks challenge UBHL's claims for losses, call it a delay tactic by Mallya

Vijay mallya may make revised rs 6 000 crore settlement offer to banks

Kingfisher Airlines,United Breweries (Holdings) Ltd,UBHL,SBI,State Bank of India SBI, consortium ,lenders, Recovery of Debt Due to Banks and Financial Institutions Act,DRT,Debt Recovery Tribunal (DBT),United spirirts

Vijay Mallya may make a revised Rs 6,000-crore settlement offer to banks looking to recover Rs 9,000 crore in dues stemming from loans to Kingfisher AirlinesBSE 3.03 % founded by the businessman, who faces the threat of having his passport cancelled.

బ్యాంకు రుణాల సెటిల్ మెంట్లకు మాల్యా మరో ప్రతిపాదన

Posted: 04/14/2016 01:17 PM IST
Vijay mallya may make revised rs 6 000 crore settlement offer to banks

బ్యాంకుల నుంచి రుణాలుగా పోందిన 9 వేల కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని ఎగవేసి విదేశాలకు పారిపోయి అర్థిక ఉగ్రవాదిగా ఖ్యాతి గడించిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా... తాను ఇప్పట్లో భారత్ కు తిరగిరానని లేద్చిచెప్పిన కేవలం రెండు వారాల్లోనే మాటమార్చారు. ఇక బ్యాంకుల నుంచి తాను పొందిన అసలు 4 వేల 900 కోట్ల రూపాయల రుణంలో 4000 కోట్ల రూపాయాలను మాత్రమే చెల్లిస్తానని, వాటిని కూడా వాయిదాల పద్దతిలో చెల్లిస్తానని చెప్పి.. తనకు అనుకూలంగా ప్లేటు ఫిరాయించిన మాల్యా ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు.

ఆయనను దిగివచ్చేలా చేసింది మాత్రం కేవలం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులే. అదెలా అంటారా..? ఇప్పటికే పలు పర్యాయాలు తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులపై విజమ్ మాల్య స్పందిస్తూ.. తాను అధికారుల ఎదుట హాజరుకావడానికి అభ్యంతరమేమీ లేదని, అయితే ఇందుకోసం తనకు కొంత సమయాన్ని ఇవ్వాలని కొరుతూ వచ్చారు. తొలిసారి అయన వినతి పట్ల సానుకూలంగా స్పందించిన ఈడీ.. ఇక ఆయనకు జలక్ ఇవ్వాలని నిర్ణయించింది.

దీంతో ఐడీబీఐ కేసులో తన ముందుకు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి నిన్న లేఖ రాసింది. ఈ విషయం తెలుసుకున్న మాల్యా ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో షాక్ తిన్న మాల్యా... బ్యాంకుల రుణాలను చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లిస్తానని ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయనకు మొట్టికాయలేసింది. ముందుగా మీ ఆస్తుల విలువెంతో చెప్పడంతో పాటు ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ కోర్టు ఆయనకు షాకిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మాల్యా వేగంగా స్పందించారు. తన పాస్ పోర్టు రద్దు అయితే మరింత విషమ పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న భావనతో ఉన్న మాల్యా... రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తీసుకోచ్చారు.

 బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు రుణాలకు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్నందున, తాను పొందిన రుణానికి మరో 1100 కోట్ల రూపాయలను వడ్డీగా కలసి మొత్తంగా 6 వేల కోట్ల రూపాయల చెల్లిస్తానని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో మొత్తం సెటిల్ మెంట్ ను చేయాలని అభ్యర్థనను ఆయన త్వరలోనే కోర్టు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Kingfisher Airlines  Enforcement Directorate  loan settlement  

Other Articles