Kareena, Saif Ali Khan and Karisma Kapoor amongst latest names exposed in scandal

Kareena saif ali khan and karisma kapoor amongst latest names exposed in scandal

Amitabh Bachchan, Kareena Kapoor Khan, Saif Ali Khan, Karisma Kapoor, Panama papers

After Bollywood mega star Amitabh Bachchan was implicated in alleged international tax evasion and money laundering scandal exposed by the Panama papers leak, some other stars’ names have cropped up. Media reports said on Thursday that a consortium of 10 people that was formed to bid for the Pune IPL team in March 2010 and that included Bollywood actor sisters Kareena Kapoor Khan and Karishma Kapoor, had formed an offshore firm to control the franchise.

పనామా జాబితాలో సైప్, కరీనా, కరిష్మా కపూర్ లు

Posted: 04/08/2016 08:07 AM IST
Kareena saif ali khan and karisma kapoor amongst latest names exposed in scandal

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పనామా పేపర్స్ లో తాజాగా మరికొంత మంది బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటకు వచ్చాయి. మొన్న అమితాబచ్చన్, ఐశ్వర్యల పేర్లను వెల్లడించిన పనామా పేపర్స తాజాగా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మాకపూల్ పేర్లను వెల్లడించింది. ఐపీఎల్ బిడ్డింగ్‌లో విఫలం కావడంతో ఈ కంపెనీని మూసివేశారు. మొత్తం పదిమంది కలిసి ఈ కంపెనీ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 15% వాటా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నమోదైన ఆబ్డురేట్ లిమిటెడ్ అనే ఆఫ్‌షోర్ కంపెనీకి కేటాయించాలనేది ఆ ఒప్పందంలో కీలక అంశం. మిగిలిన దాంట్లో 33 శాతం పారిశ్రామికవేత్తలైన చోర్దియా కుటుంబానికి, బాలీవుడ్ హీరోయిన్లు కరీనా,కరిష్మాలకు చెరో 4.5%, సైఫ్‌కు, ముంబైకి చెందిన మనోజ్ ఎస్ జైన్‌కు చెరో 9%, వీడియోకాన్ గ్రూప్ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్‌కు చెందిన రెండు కంపెనీలకు 25% వాటాలు ఖరారు చేశారు. తనకు 25% వాటా ఉండేదని, ఆబ్డురేట్ గురించి తనకు తెలియదని ధూత్ అన్నారు. మరోవైపు అతుల్ చోర్దియా తమ గ్రూప్ 100% వాటా కలిగి ఉండేదని, ఆఫ్‌షోర్ కంపెనీలో ఎలాంటి వాటాలు లేవని అన్నారు.

పనామా పేపర్స్ లో భాగంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన మరో వివాదంకూడా వెలుగు చూసింది. స్పోర్ట్స్ ప్రమోటర్, ట్వంటీఫస్ట్ సెంచరీ మీడియా ఎండీ లోకేశ్‌శర్మకు బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్‌లో రిజిష్టరైన రెండు కంపెనీలున్నాయి. మూడో కంపెనీ ట్వంటీఫస్ట్‌కు అనుబంధ కంపెనీగా నమోదైంది. దీనిపై శర్మ స్పందిస్తూ మార్గరీటా సర్వీసెస్ అనే కంపెనీని టేకోవర్ చేద్దామనుకున్నప్పటికీ అది జరగలేదని చెప్పారు. మర్దీగ్రాస్ హోల్డింగ్స్, పెప్పర్‌మింట్ మేనేజ్‌నెంట్ అనే రెండు కంపెనీలు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేశామని, పన్ను ఎగవేతలేమీ లేవని స్పష్టం చేశారు. ఈయన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి, బీజేపీ నాయకత్వానికి సన్నిహితుడని అంటున్నారు. గురువారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన జాబితాలో ఢిల్లీకి చెందిన ఓడీలరు, బ్యూటిక్ యజమాని, ఆస్ట్రేలియా గనుల కుబేరుని కుమార్తె, టెక్స్‌టైల్ ఎగుమతిదారు, ఇంజినీరింగ్ కంపెనీ యజమాని, చార్టర్డ్ అకౌంటెంట్, లోహాల కంపెనీ డైరెక్టర్ల పేర్లు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Kareena Kapoor Khan  Saif Ali Khan  Karisma Kapoor  Panama papers  

Other Articles