Air India pilot insists for particular woman co-pilot

Air india pilot insists for particular woman co pilot

Air India, Pilot, Co Pilot, Air India Passengers

110 passengers aboard an Air India aircraft were forced to sit on the plane for two and half hours on Wednesday after its commander insisted for a "particular woman" co-pilot to operate the flight. The incident happened at Air India's flight to Male from Chennai via Thirunanthapuram, sources said.

ఆ లేడీ పైలెట్ ను పంపలేదని.. విమానం ఆపాడు

Posted: 04/07/2016 03:24 PM IST
Air india pilot insists for particular woman co pilot

ఒక్కరి కోసం ఓ విమానం ఆగిపోయింది. ఆ వ్యక్తి వచ్చే వరకు ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. ఓ పైలట్ తనకు నచ్చిన మహిళా పైలట్-ను తనతో పాటుగా విధులకు పంపించాలనే డిమాండ్-తో 110 మంది ప్రయాణీకులు సుమారు రెండు గంటల పాటు విమానంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి కల్పించి ఇబ్బంది పెట్టాడు. తనకు నచ్చిన మహిళా పైలట్‌-ను కో-పైలట్‌-గా ఇవ్వలేదన్న కారణంతో ఆ పైలట్ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత నింగిలోకి ఎగిరింది.

పైలట్ మంకుపట్టుతో ఎయిర్ ఇండియా విమానంలో 110 మంది ప్రయాణీకులు రెండున్నర గంటల పాటు విమానంలోనే బలవంతంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మాలే నుంచి చెన్నై మీదుగా తిరువనంతపురం వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యేకంగా తాను కోరిన మహిళా కో పైలట్ నే Al 263/264 విమానంలో తనతో పాటు విధులకు పంపించాలంటూ పైలట్ పట్టుబట్టాడు. దీంతో అసలు గొడవ ప్రారంభమైంది. అయితే ఆమె అప్పటికే ఢిల్లీ ఫ్లైట్ కు వెళ్ళాల్సిన రోస్టర్-లో ఉందని, అతడి డిమాండ్ తీర్చడం కుదరదని రోస్టర్ సెక్షన్ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం ఉదయం విధులకు హాజరైన అతడు రోస్టర్ సెక్షన్-లో అదే తీరులో వ్యవహరించాడు. తనకు బీపీ పెరిగిందని, అనారోగ్యం పేరుతో కాలయాపన చేశాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించకపోవటంతో తాను కోరిన కో పైలట్ ను పంపించనిదే విధులకు వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  Pilot  Co Pilot  Air India Passengers  

Other Articles