Nara Chandrababu Naidu name in Panama papers

Nara chandrababu naidu name in panama papers

YSRCP, Chandrababu Naidu, Panama papers, Vasi Reddy Padma

YSRCP Leader Vasi Reddy Padma pronounce AP CM Chandrababu Naidu name in Panama papers, Panama papers reveals who have black money.

నల్ల కుబేరుల జాబితాలో చంద్రబాబు నాయుడు

Posted: 04/05/2016 03:20 PM IST
Nara chandrababu naidu name in panama papers

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లకుబేరుల లిస్ట్ బయటపెట్టిన పనామా పేపర్స్ జాబితా గురించి అందరికి తెలుసు. పనామా పేపర్స్ ఎవరెవరు ఎంత నల్ల ధనాన్ని కలగి ఉన్నారు.. ఎక్కడెక్కడ నల్ల డబ్బును పెట్టుబడిగా పెట్టారు అన్న దానిపై డాక్యుమెంట్లతో సహా వివరాలను ప్రచురించింది. పుతిన్ దగ్గరి వారి నుండి నవాజ్ షరీఫ్ వరకు, అమితాబ్ నుండి ఐశ్వర్య వరకు అందరి పేర్లను అందులో వెలికితీశారు. అయితే తాజాగా ఏపి ముఖ్మంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు కూడా త్వరలోనే పనామా పేపర్స్ లో వస్తుందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు.

విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల చిట్టా విప్పుతున్న పనామా జాబితా చంద్రబాబు ఉన్నారని... ఆ వివరాలన్నీ త్వరలోనే బయటికి వస్తాయని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కేంద్రం దర్యాప్తు చేస్తే బాబు పేరు బయటపడుతుందన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం విదేశాల చేతుల్లో ఎందుకు పెట్టారో పనమా పేపర్లలో బయటకు వస్తుందని తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్రం నిఖార్సయిన దర్యాప్తు జరపాలని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Chandrababu Naidu  Panama papers  Vasi Reddy Padma  

Other Articles