telugu state assemblies lauds baahubali movie unit for winning national award

Ap and telangana assemblies appreciates national award winner bahubali team

ss rajamouli, Tamannaah, Rana Daggubati, Prabhas, Bahubali, baahubali, Anushka Shetty, AP assembly, Telangana assembly, cm kcr, cm chandrababu, bahubali, national award, kcr, chandra babu, TDP, TRS

Telanagana and Andhra pradesh state assemblies lauds baahubali movie unit for winning national award

బాహుబాహు ‘బాహుబలి’ బహుబాగు ‘బాహుబలి’, తెలుగు అసెంబ్లీలలో ప్రశంసలు

Posted: 03/29/2016 08:18 PM IST
Ap and telangana assemblies appreciates national award winner bahubali team

టాలీవుడ్ రేంజ్ బాలీవుడ్ కాదని, ఏకంగా హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లగల దర్శకులు, నిర్మాతలు, అంతేకాదు నటులు, నటీమణులు వున్నారని రుజువు చేసిన చిత్రం బాహుబలి. కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించిన ఈ చిత్రం 2015వ సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. సోమవారం ప్రకటించిన 63వ జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో 'బాహుబలి'కి జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులు దక్కించుకుంది. ఒక తెలగు సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవటం ఇదే తొలిసారి కవడంతో మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాయి.

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్టాడుతూ 'ఒక తెలుగు చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటం ముదావహామని కోనియాడారు. అయితే బాహుబలి వంటి తెలుగు చిత్రం తొలిసారి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడం మొదటిసారని సీపీఐ సభ్యులు తనకు చెప్పారని కేసీఆర్ చెప్పారు. తెలుగు సినిమా ఖ్యాతిని దేశానికి తెలియజేసి, అటునుంచి ప్రపంచానికి తెలియజేసిన బహుబలి చిత్రానికి, నటీనటులకు, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే కాక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమంలోనూ బాహుబలి, కంచె సినిమాలపై ప్రశంసలు కురిపించారు. 'ఈ రోజు మనకు రెండు పండుగలు. ఒకటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావదినోత్సవమైతే, రెండోది ఒక తెలుగు చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించడం. అదీ.. తెలుగువారి సత్తా' అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా బాహుబలిని బహుబలిగా చంద్రబాబు పలికితే, కేసీఆర్ తనదైన మార్కు'ఆ సినిమా పేరేదో ఉండే..'అని సభ్యులను అడగటంతోపాటు 'నిజానికి నేను ఆ సినిమా చూడలేదు' అని వ్యాఖ్యానించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP assembly  Telangana assembly  cm kcr  cm chandrababu  bahubali  national award  

Other Articles