In South Korea a woman through her 20 thousand dollars on road

In south korea a woman through her 20 thousand dollars on road

Soth Korea, South Korea Woman, 20 thousand Dollars

In South Korea a woman through her 20 thousand dollars on road. But no one touch that amount. There is a rule to not to tocuh others property.

13లక్షలు రోడ్డు మీద. అయినా ముట్టుకోలేదు

Posted: 03/26/2016 08:55 AM IST
In south korea a woman through her 20 thousand dollars on road

ధనమేరా అన్నిటికి మూలం అని పెద్దల మాట. అందుకే అందరం కూడా డబ్బులకు ఎంతో విలువనిస్తాం. ఎంతలా అంటే చివరకు మన అనుకునే మనుషులను కూడా దూరం చేసుకోవడానికి సిద్దపడతామూ గానీ డబ్బులు మాత్రం వదులుకోము. మరి అలాంటి డబ్బును ఓ మహిళ తనకు అక్కర్లేదని దాదాపు 20 వేల డాలర్ల (దాదాపు 13 లక్షల రూపాయలు)ను నడిరోడ్డు మీదకు విసిరేసింది. అలా రోడ్డు మీద పడి ఉన్న డబ్బును గమనించి తమకు కూడా అక్కర్లేదని పక్కకు తప్పుకుని వెళ్లిపోయారు రోడ్డు మీద నిడిచే వారు. ఇది ఇతర దేశాల వారికి ఆశ్చర్యం కలిగించే వార్తేమో కానీ, దక్షిణ కొరియా వాసులకు మాత్రం ఆశ్చర్యం కలిగించే వార్త కాదు. ఎందుకంటే దక్షిణ కొరియాలో ఉద్దేశ పూర్వకంగా దొంగతనం చేయడమే కాదు.. తమది కాని వస్తువును తీసుకున్న వారు కూడా శిక్షార్హులే. దీంతో ఇతరులెవరూ ఆ డబ్బు జోలికి వెళ్లలేదు.

అయితే ఇంతకీ ఆ మహిళ డబ్బు ఎందుకు విసిరిందో తెలుసా? ఆ మహిళ పేరిట బ్యాంకులో ఉన్న ఈ డబ్బు గురించి ఆమె కొడుకు, భర్త కొన్నాళ్లగా వేధిస్తున్నారట. అందుకే వాళ్లకు ఈ ధనం దక్కడం ఇష్టం లేక.. ఇతరులకు అందిద్దామనే ఉద్దేశంతో ఇలా రోడ్డు మీదకు విసిరేసిందట. అయితే ఆ డబ్బును ఇతరులెవరూ కనీసం ముట్టుకోలేదు. మొత్తానికి చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న దక్షిణ కొరియా వాసులు సూపర్‌ కదూ! మన దేశంలో ఇది కనీసం ఊహించడానికి కూడా సాధ్యమా..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soth Korea  South Korea Woman  20 thousand Dollars  

Other Articles