Want BJP ticket, bring 25k likes on FB

Want bjp ticket bring 25k likes on fb

BJP, ticket, Amith Sha, facebook, twitter

day after BJP's national president Amit Shah reportedly told UP assembly hopefuls that their social media presence will determine their suitability for the 2017 polls and encouraged those vying for tickets to have 25,000 followers or likes each, the state BJP members with limited or nil presence on Facebook and Twitter are left in a quandary.

ఫేస్ బుక్ లో లైకులు ఉంటే పార్టీ టికెట్

Posted: 03/23/2016 11:21 AM IST
Want bjp ticket bring 25k likes on fb

పాలిటిక్స్ లో రాణించాలంటే పలుకుబడి ఉండాలి. అంతకు మించి డబ్బు ఉండాలి. కానీ తాజాగా ఓ జాతీయ పార్టీ మాత్రం మీకు ఫేస్ బుక్ లో ఎన్ని లైకులు ఉన్నాయని అడుగుతోంది. మీ ట్విట్టర్ అకౌంట్ ను ఎంత మంది ఫాలో అవుతున్నారని ప్రశ్నిస్తోంది. ఇంతకీ ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా..? పార్టీ టిక్కెట్ కావాలంటే కావాల్సిన అర్హతలు. ఇవేం అర్హతలు అని అందరి ఆశ్చర్యపోతున్నారు. కానీ బిజెపి పార్టీ పెద్దలు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల సెల‌క్షన్ లో వినూత్నపంథాకు తెర‌లేపారు బిజెపి చీఫ్ అమిత్ షా.ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున టికెట్స్ ఆశిస్తున్న వారికి కొత్త క్వాలిఫికేష‌న్స్ కావాల‌ని నిబంధ‌న పెట్టాడు క‌మ‌ల ద‌ళ‌ప‌తి.అదేంటంటే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి ఎవ‌రైనా స‌రే ఆ అభ్యర్థి ఫేస్ బుక్ లో ఇర‌వై ఐదువేల లైక్స్ ..ట్విట్టర్ లో ఇర‌వై ఐదువేల లైక్స్ త‌ప్పనిస‌రి అలాంటి వారికే టికెట్  ఇస్తాన‌ని స్పష్టం చేస్తున్నారు.

త‌మ‌కు టికెట్ ఇస్తే కోట్ల రూపాయ‌లు పార్టీకి డొనేష‌న్ ఇస్తామ‌ని ..కులంగోత్రం..పార్టీకి తాము చేసిన సేవ‌లను ఏక‌రువు పెడుతూ ఒంగి ఒంగి దండాలు పెడుతున్న వారంతా అమిత్ షా తాజా కండీష‌న్స్ తో క‌ళ్ళు తేలేస్తూ ..ల‌బోదిబో మంటున్నారు.ఏ ఒక్కరికి ప‌దివేల‌కు మంచి ఫాలోవ‌ర్స్ లేని త‌రుణంలో మిగ‌తా వారి లైక్ ల కోసం ఎలాగంటూ చెవులు కొరుక్కుంటున్నారు.మ‌నిషి దైనందిన జీవితంలో అంత‌ర్బాగ‌మైన సోష‌ల్ మీడియా ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించ‌డం విశేష‌మే మ‌రి. మొత్తానికి అమిత్ షా నిర్ణయంతో ఒక్కసారిగా రాజకీయ నాయకుల్లో కలకలం రేగుతోంది. జన బలం ఉంటే సరిపోతుంది అనుకున్న వారికి ఈ వార్త కాస్త ఛేదుగానే అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  ticket  Amith Sha  facebook  twitter  

Other Articles