Chanrababu naidu dont have respect at women

Chanrababu naidu dont have respect at women

Chandrababu Naidu, AP, Roja, Women, Ladies, Balakrishna, Ravela Kishore, Nara Lokesh

YSRCP MLA Roja one more time attacked on AP CM Chandrababu Naidu. She said that Babu dont have respect on women. There is protection for Woman in AP.

ITEMVIDEOS: చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు: రోజా

Posted: 03/07/2016 03:29 PM IST
Chanrababu naidu dont have respect at women

చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదని, టీడీపీ నేతలకు మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మహిళలపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నడిరోడ్డుపై మంత్రి రావెల కొడుకు మహిళ చేయి పట్టుకుని లాగలేదా…అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో కాబట్టే రావెల సుశీల్‌పై కేసు పెట్టారని… అదే ఏపీలో అది జరిగివుంటే కుక్క పేరు చెప్పి తప్పించుకునేవారని అన్నారు రోజా.
చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. బాలకృష్ణ, నారా లోకేష్‌కు మహిళలంటే గౌరవం లేదని, వారి బాటలోనే పార్టీలోని ఇతరులు నడుస్తున్నారని విమర్శించారు. ఓ సినిమా వేడుకలో అసభ్యంగా మాట్లాడిన బాలకృష్ణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని అన్నారు. నాయకులే ఇలా ఉంటే...ఇక ఆ పార్టీ ఏం నేర్చుకుంటుందని ఆమె అన్నారు.

మంత్రి రావెల కిషోర్‌ కుమారుడి కేసులో జగన్‌ని లాగటం హాస్యాస్పదమని, జగన్‌ బుర్ఖాలో వచ్చారా.. సీసీ కెమెరా పెట్టారా? అని రోజా ప్రశ్నించారు. రావెల కిశోర్‌బాబు రాజీనామా చేసే వరకు మహిళా దినోత్సవం చేసే అర్హత ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. మహిళలను ఆడపడచులుగా చూసిన ఎన్టీఆర్‌ కుమారుడిగా బాలకృష్ణ హుందాగా వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. రావెల కుమారుడు మహిళను వేధిస్తూ పట్టుబడి జగన్‌ కుట్రపన్నారని ఆరోపిస్తున్నారని, ఈ సంఘటనే ఏపీలో జరిగి ఉంటే విషయాన్ని బయటకు రానిచ్చేవారు కాదని రోజా అన్నారు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP  Roja  Women  Ladies  Balakrishna  Ravela Kishore  Nara Lokesh  

Other Articles