Man gets detergent instead of his ordered xolo tab

Polie investigating guntur online shopping scam case

Online Shopping, Snapdeal, Detergent soap, blue dart courier, snapdeal online shopping, online shopping scam, online shopping fraud, online shopping cheating, detergent instead of tab, blue dart, yadlapadu, guntur

Guntur policce investigatigating online fraud case as a yadlapadu tailor gets detergent instead of his ordered xolo tab

మరోమారు వెలుగుచూసిన ఆన్‌లైన్ మోసం.. ట్యాబ్ బదులు సబ్బబిళ్ల

Posted: 03/05/2016 11:05 AM IST
Polie investigating guntur online shopping scam case

ఆన్‌లైన్ షాపింగ్‌లో అవకాయ కోంటే అముదం పంపుతారన్న జోకులు అనేకం చక్కర్లు కొట్టిన నాటి నుంచి ఇప్పడు ఎవరు చూసినా.. అన్ లైన్ షాపింగ్ అనే స్థాయికి చేరుకున్నా.. ఈ కామర్స్ ముసుగులో ఇంకా అక్కడక్కడా అడపాదడపా మోసాలు జరుగుతూనే వున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ గురించి అంతగా ప్రచూర్యం లేని ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ గురించి పట్నవాసులకన్నా.. పల్లెవాసులలోనే అవగాహన బాగా పెరింగిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.

ట్యాబ్ బుక్ చేసుకుంటే సబ్బు బిళ్ల చేతికి లభించడంతో ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు ఓ యువకుడు. గుంటూరు జిల్లా యడ్లపాడు రాజీవ్‌గాంధీ సెంటర్‌కు చెందిన టైలర్ భాస్కర్ ఫిబ్రవరి 16న సోలో కంపెనీ ట్యాబ్‌ను స్నాప్‌డీల్ ద్వారా బుక్ చేశాడు. అది సరిగ్గా నాలుగు రోజులకు చిలకలూరిపేట బ్లూడార్ట్ కొరియర్ సెంటర్‌కు వచ్చింది. అదే నెల 21న బ్లూడాట్ సెంటర్‌కు వెళ్లిన భాస్కర్ ను.. ముందుగా ట్యాబ్ కు సంబంధించిన నాలుగు వేల రూపాయల డబ్బులు చెల్లించాలని కోరిన కంపెనీ వారు.. ఆ తరువాత ఆయన పార్శిల్ ను ఇచ్చారు.

పార్శిల్ ను అందుకున్న భాస్కర్ అక్కడే బాక్స్ తెరిచి తాను అర్ఢర్ చేసిన ట్యాబ్ ఎలా వుందో చూద్దామని పార్శిల్ ను అక్కడే తెరచి చూశాడు. అంతే... అందులో ట్యాబ్ బుదులుగా డిటర్జెంట్ సబ్బు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. సబ్బుతో పాటు ఇయర్ ఫోన్, బ్యాటరీ ఉన్నాయి కానీ ట్యాబ్ లేదు. ఇదేమని ప్రశ్నిస్తే కొరియర్ వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Online Shopping  Snapdeal  Detergent soap  blue dart  yadlapadu  guntur  

Other Articles