5 Women Among 8 Maoists Slain on Telangana-Chhattisgarh Border

Encounter in chhattisgarh telangana border 8 maoists killed

maoists, telangana police, chhattisgarh police, telangana-chhattisgarh police joint operation, encounter, chhattisgarh-telangana border, Telangana anti-Naxal force, Telangana Maoist party Secretary Hari Bhushan, Divisional Commander Lachhanna, Putapadu, Cherla

At least eight Maoists were killed in a gunbattle with police near the border of Telangana's Khammam district and neighbouring Chhattisgarh state in the early hours on Tuesday, police said.

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోలు మృతి

Posted: 03/01/2016 12:28 PM IST
Encounter in chhattisgarh telangana border 8 maoists killed

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును, అదే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు బల్కా సుమన్ సోదరి వివాహానికి హాజరైన పక్షంలో హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేసి.. తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించిన మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. సుకుమా జిల్లా పుట్టపాడు వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలం వద్ద ఏకే 47, 6 ఎస్ఎల్ఆర్ తుపాకులు, 303 మూడు రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం ఖమ్మం జిల్లా చర్లకు 15 కి.మీ.ల దూరంలో ఉంది. గడిచిన రెండు నెలల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉండగా...  వెంకటాపురం ఏరియా కార్యదర్శి లచ్చన్న, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రకార్యదర్శి హరిభూషణ్ మరణించినట్లు తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  telangana police  chhattisgarh police  encounter  chhattisgarh-telangana border  

Other Articles