'I Am Not Acting in the Movie' says himanshu

Himanshu clarifies on acting in the short film

I Am Not Acting in the Movie, ktr son, himanshu rao, kcr, telangana, k chandrasekhar rao, United Nations World Tourism Organization, Telangana Chief Minister’s grandson

Telangana Chief Minister’s grandson and KTR’s son, Himanshu Rao has denied acting in any movie produced by the United Nations World Tourism Organization (UNWTO).

షార్ట్ ఫిల్మ్ ‘సూపర్ హార్ట్’లో నటనపై హిమాన్షు క్లారిటీ

Posted: 03/01/2016 11:54 AM IST
Himanshu clarifies on acting in the short film

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు గారి మనవడు నటనపై ఆసక్తిని కనబర్చాడని, త్వరలోనే ఆయన ఓ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా నటిస్తున్నారని వచ్చిన వార్తలపై కేటీఆర్ పుత్రరత్నం, హిమాన్షు స్పందించారు. తాను సూపర్ హార్ట్ షార్ట్ ఫిల్మ్‌లో నటించటం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన విద్యాభాసం కోసమే తన సమయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదీ కాకుండా పరీక్ష కాలం తరుణంలో తన దృష్టి యావత్తు పరీక్షలపైనే వుందని స్పష్టం చేశారు.

యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు సూపర్ హీరోగా నటిస్తున్నాడని నిర్వాహకులు చేసిన ప్రచారాన్ని ఆయన ఖండించారు.  ఇందులో నటించేందుకు అవకాశం వచ్చిన మాట నిజమే కానీ, తాను మాత్రం నటించట్లేదని హిమాన్షు తెలిపాడు. ఈ విషయాన్ని హిమాన్షు సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో తెలిపాడు. ప్రస్తుతం చదువు, పరీక్షలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr son  himanshu  short film  superheart  

Other Articles