Cheapest phone feedom251 not available in site

Cheapest phone freedom251 not available in site

Freedom251, cheapest mobile, ringingbells

Freedom 251 was officially launched in New Delhi on Wednesday by Noida-based firm Ringing Bells. Bookings for the Rs. 251 smartphone, arguably the cheapest in the world, are now open and you can buy one by heading to the official website freedom251.com

251రూపాయల ఫోన్ బుక్ కాలేదు... కానీ

Posted: 02/18/2016 01:11 PM IST
Cheapest phone freedom251 not available in site

రెండు వందల యాభై ఒక్క రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌ కోసం యువత ఎగబడ్డారు. నిన్న ఫోన్‌ లాంచింగ్ సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రకటించింది. ఇది ఎప్పుడెప్పుడు సొంతం చేసుకుందామా అని ఎదురు చూసిన యువత ఉదయం 6 గంటలకే ఇంటర్నెట్‌ల ముందు వాలిపోయారు. అయితే అప్పటి నుంచి 9 గంటలు దాటినా వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.

ప్రీడం 251 పేరుతో ప్రపంచంలో అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రింగ్ బెల్ సంస్థ వినియోగదారులను క్షమాపణలను కోరింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగా నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.  ప్రీడమ్ 251 ఫోన్ బుకింగ్ చేసుకోవాలనుకునే వారు  http://www.freedom251.com లో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే సంస్థ వెబ్ సైట్ సెకనుకు 6లక్షల హిట్స్ తో విపరీతమైన ఒత్తిడికి గురై సర్వర్లు తట్టుకోలేకపోయాయని సంస్థ ఒక ప్రకటనలో తెలియచేసింది. అపారమైన స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన సంస్థ... సమస్యను 24గం,,లో అదిగమించి మీ ముందుంటామని ప్రకటించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Freedom251  cheapest mobile  ringingbells  

Other Articles