KCR receives a rare birthday gift from Andhra fan

Ananthpuram fam gifts a shalw to kcr couple

kcr, trs, silk fabric, dharmavaram, telangana cm, kcr birthday gift, weaver, handloom, rare gift for kcr, ananthapur fan gift to kcr, kcr birthday gift, dharmavaram shawl, shawl with kcr picture

Telangana Chief Minister K. Chandrashekhar Rao received a spectacular gift on his 63rd birthday on Wednesday in Hyderabad

కేసీఆర్ కు అనంతపురవాసి అపురూప బహుమతి..

Posted: 02/17/2016 06:36 PM IST
Ananthpuram fam gifts a shalw to kcr couple

తన జన్మదిన రోజును పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ఆయన తనయుడు గ్రేటర్ ఎన్నికలలో 99 స్థానాలను బహుమతిగా అందించగా, తాజాగా ఆయన మేనల్లుడు హరీష్ రావు నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి బహుమతిగా అందించాడు. అయితే తనయుడు, మేనల్లుడే కాదు.. ఆయనకు వున్న అనేక మంది అభిమానులలో ఒకరైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురం వాసి కూడా అరుదైన బహుమతిని అందించారు. అది కూడా ఎంతో అపురూపమైన బహుమతి అందించారు.

ధర్మవరం పట్టు శాలువా మీద కేసీఆర్ దంపతుల ఫొటోలను చిత్రించిన శాలువాను ఓ అభిమాని బహుమతిగా ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన అతడు... ఈ శాలువాను స్వయంగా నేసి, హైదరాబాద్ తీసుకొచ్చి కేసీఆర్‌కు పుట్టినరోజు సందర్భంగా బహూకరించారు. రాష్ట్రం వేరయినా.. ముఖ్యమంత్రి మీద అభిమానంతో ఈ శాలువాను తాను రూపొందించినట్లు ఆ అభిమాని తెలిపాడు. నేతలోనే కలిసిపోయిన తమ దంపతుల ఫొటోలు చూసి కేసీఆర్ కూడా సంబరపడ్డారు. ఆ అభిమానిని కేసీఆర్ అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR birthday  dharmavaram shawl  gift  

Other Articles