She was raped by 110 men in 22 hours

She was raped by 110 men in 22 hours

Greece, She raped by 110 men, Briton

Her holiday to Greece turned into a dreaded nightmare. At the age of 14, Megan Stephens (not her real name) had gone to a seaside town in Greece with her mother on a holiday; hardly she knew how horrifying the trip would turn out to be. The Briton was sold as a sex slave and continued to work as a prostitute for six years before her escape in 2009.

వాడిని నమ్మింది.. 22 గంటల్లో 110 మంది రేప్ చేశారు

Posted: 01/23/2016 01:41 PM IST
She was raped by 110 men in 22 hours

అవును.. నమ్మిన వాడు మోసం చేశాడు.. మోసం అంటే అదేదో మామూలు మోసం కాదు. జీవితాంతం శిక్షించినా కూడా కోపం తగ్గని మోసం చేశాడు. తను జీవితాంతం చూసుకుంటాడని అనుకుంటే.. వాడు ఆమె ఒళ్లును తన ఆదాయంగా మార్చుకున్నాడు. టూర్ అని వెళ్లిన ఆమె జీవితమే మలుపు తిరిగింది. ఆమెను 22 గంటల్లో ఏకంగా 110 మంది రేప్ చేశారు. అవును మీ చదువుతున్నది అక్షరాల నిజం. 110 మంది ఆమెను రేప్ చేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. తన వ్యధ గురించి రాసిన ఓ పుస్తకం తాజాగా విడుదల కానున్న నేపధ్యంలో ఈ ఘటన మీద సర్వత్రా చర్చ సాగుతోంది.

గ్రీకు దేశానికి టూర్ అని వచ్చిన ఓ 14 ఏళ్ల అమ్మాయి 2009 లో తన జీవితాన్ని మలుపుతిప్పే ఘటన జరిగింది. తల్లితో కలిసి వచ్చిన ఆమె ఓ గ్రీకు బార్‌లో జాక్‌ ను తొలిసారి కలిసింది. అప్పటికే ప్రేమ కోసం తహతహలాడుతున్న మేగన్ అతన్ని తొందరగానే వలచింది. తల్లికి జాక్‌ నచ్చకపోయినా అతనితో కలిసి ఉండేందుకు అంగీకరించింది. ఎందుకంటే ఆమె బార్‌ ఓనర్ నికోస్‌తో అప్పట్లో సన్నిహితంగా ఉండేది. విహారయాత్ర ముగిసాక జాక్‌తో గ్రీకులోనే ఉండిపోతానని మేగన్‌ తల్లిని ఒప్పించింది. తన అధీనంలోకి వచ్చిన తర్వాత టాప్‌ లెస్‌ బార్‌లో నర్తించాల్సిందిగా మేగన్‌ను జాక్‌ ఒత్తిడి తెచ్చాడు.

అలా ఆమెను వత్తిడి చేస్తూ చేస్తూ చివరకు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు. ఆమె ప్రియుడే 'సెక్స్‌ బానిస'గా ఆమెను అమ్మేశాడు. దీంతో ఆరేళ్లపాటు వేశ్యగా నరకయాతన అనుభవించిన మేగన్ ఎట్టకేలకు తప్పించుకొని బయటపడింది.ఇప్పుడు ఆ నరకయాతన, వ్యభిచార కూపపు అనుభవాలను మారుపేరుతో 'బాట్‌ అండ్‌ సోల్డ్‌'గా పుస్తకరూపంలో ప్రచురించింది. ఒక వ్యభిచారిగా తాను అనుభవించిన హృదయవిదారకమైన దుస్థితిని ఈ పుస్తకంలో మేగన్ వివరించింది. రోజుకు 50 మందితో పడుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఒక్కోసారి 22 గంటల్లో 110 మంది ఆమెను బలవంతంగా అనుభవించేరట. తన 14 సంవత్సరాల అనుభవాలను ఆమె తన పుస్తకంలో వివరిచింది.  ఇప్పుడు 25 ఏళ్ల ఆమె ఓ వ్యక్తిని పెళ్లాడి గర్భవతి అయింది. అక్రమ రవాణా బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులైన మహిళలకు చేయూత అందించేందుకు ఓ చారిటీని స్థాపించాలని ఆమె భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greece  She raped by 110 men  Briton  

Other Articles