Kejriwal to Hyderabad central University

Kejriwal to hyderabad central university

Kejriwal, Rohith, Hyderabad Cebtral University, HCU, Rohith Suicide

Dalhi Cm Kejriwal will arrive to Hyderabad central University today. He will meet Rohith Family members and student union leaders.

నేడు హైదరాబాద్ వర్సిటీకి కేజ్రీవాల్

Posted: 01/21/2016 08:30 AM IST
Kejriwal to hyderabad central university

అంతకంతకు వివాదాస్పదంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రోహిత్ ఆత్మహత్యను ఖండిస్తూ.. హెచ్.సి.యుకు నాయకుల పర్యటనలు పెరిగాయి. విద్యార్థి ఆత్మహత్యను రాజకీయం చేస్తూ రాజకీయ నాయకులు యూనివర్సిటికి పర్యటనకు వస్తూ విద్యార్థులను మరింత రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యూనివర్సిటీని సందర్శించారు. ఏపి ప్రతిపక్షనేత జగన్ కూడా హెచ్.సి.యును సందర్శించారు. అయితే తాజా దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హైదరాబాద్ రానున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు రానున్న ఆయన నేరుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనున్నారు. రోహిత్ ది ఆత్మహత్య కాదు హత్యే అని.. కాషాయహత్య అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వర్సిటీ విద్యార్థులతో సమావేశమై వారి ఆందోళనకు సంఘీభావం తెలపనున్నారు. అదేవిధంగా రోహిత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. రోహిత్ ఆత్మహత్య వివాదం జాతీయ స్థాయిలో కూడా సంచలనం రేపుతోంది. అందుకే రాజకీయ నాయకులు దీని మీద వెంటనే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kejriwal  Rohith  Hyderabad Cebtral University  HCU  Rohith Suicide  

Other Articles