Pantless subway riders spotted in New York

Pantless subway riders spotted in new york

Pantless subway ride, New York, No Pants subway Ride, New York City

New York citizens were spotted in the city,without any pants on. The 15th Annual No Pants subway Ride kicked off at 3:00 p.m. and had participants strut their stuff from seven different points all over New York City only to eventually meet in Union Square.

ITEMVIDEOS: ప్యాంటు లేకుండా ప్రయాణం... న్యూయార్క్ వాసుల సరదా

Posted: 01/12/2016 10:44 AM IST
Pantless subway riders spotted in new york

బుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని అంటారు. ఒక్కోరిది ఒక్కో అభిరుచి. ఒకడేమో ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటారు ఇంకొకరేమో కండోమ్ ఛాలెంజ్ అంటారు. అలా ఎవరికి వారు కొత్త ట్రెండ్ కు తెర తీస్తున్నారు. అయితే తాజాగా న్యూయార్క్ లో నో ప్యాంట్ సబ్ వే రైడ్ బాగా పాపులర్ అయింది. ఇంతకీ ఇందులో ఏం చేస్తారో తెలుసా..? ప్యాంటు లేకుండా సబ్ లో ప్రయాణించాలి. అవును ఆడ, మగ తేడాలేకుండా ఇలా ప్యాంటు లేకుండా పాలుపంచుకున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో నో ప్యాంట్స్ సబ్‌వే రైడ్‌కు పిచ్చి రెస్పాన్స్ వస్తోంది

న్యూయార్క్‌లో 2002లో ఏడుగురితో ప్రారంభమైన ఈ సరదా ఇప్పుడు మహా ఉద్యమమైంది. 60కి పైగా దేశాల్లో వేలాది మంది ప్యాంట్లు విప్పి రైలు ప్రయాణం చేస్తున్నారు. గత ఏడాది నాలుగు వేల మందికి పైగా ఈ సరదా తీర్చుకున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ సరదా కాంపిటీషన్ కు అందరూ ఎగబడుతున్నారు. తోటి ప్రయాణికుల ముందే ప్యాంట్లు వదిలిపెట్టి ఏమీ తెలియనట్లుగా కూర్చుంటున్నారు. వీరిమధ్య అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఒకరికొకరు తెలియనట్లు నటిస్తారు. అందరూ వింటర్ సీజన్‌లో పెట్టుకునే గ్లౌజెస్,టోపీ, కోటు ధరిస్తారు. వేర్వేరు స్టేషన్లలో ఎక్కుతారు. ప్యాంట్ వేసుకోవడం మరిచారని ఎవరైనా అడిగితే అరే అవును మరచిపోయానని చిరునవ్వుతో చెబుతారు. కొందరు వీరిని తమ సెల్‌ఫోన్‌లో బంధిస్తుంటే మరికొందరు సరదాగా చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pantless subway ride  New York  No Pants subway Ride  New York City  

Other Articles