Aamir Khan no more face of Incredible India

Aamir khan no more face of incredible india

Aamir Khan, Incredible India, Mahesh Sharma

The government's contract with a creative agency for the 'Incredible India' promotion that featured Aamir Khan has come to an end and a decision will be taken on whether it is to be renewed, culture minister Mahesh Sharma said. The minister told TOI that a payment of Rs 2.96 lakh has been made to the agency and a board will take a decision on the future dealings.

అమీర్ బ్రాండ్ అంబాసిడర్ గౌరవం పోయింది..?

Posted: 01/07/2016 10:08 AM IST
Aamir khan no more face of incredible india

నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని అందరూ అంటుంటారు. అందుకే మన నోటి నుండి వచ్చే ప్రతిమాటను అదుపులో ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. అయితే అలాంటి నోటి దూలతోనే అమీర్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. దేశంలో ఎక్కువ మంది అసహ్యించుకున్న వ్యక్తుల్లో ఒకటిగా చోటుసంపాదించడమే కాకుండా తాజాగా ఇన్ క్రిడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించిందని సమాచారం.

ఇన్‌ క్రిడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా అమిర్ ఖాన్ ఎన్నో యాడ్ లు చేశాడు.  అయితే గత ఏడాది నవంబర్‌‌లో అసహనంపై అమిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ విడిచి పోదామా అని తన భార్య కిరణ్ అడిగినట్లు ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. దీనిపై పలు వర్గాలు మండిపడ్డాయి. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారత్ విడిచే ఉద్దేశం తన కుటుంబానికి లేదంటూ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. అసహనంపై అమిర్ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌ నుంచి ఆయనను తొలగించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Incredible India  Mahesh Sharma  

Other Articles