Driver Travel 30 km With Dead Body

Driver travel 30 km with dead body

Car, Dear Body on car, nalgonda, nalgonda accident

Old Man Died After Hit By Car in Nalgonda District. Venkatreddy named old person crossing the road while crossing a car hit him.

ITEMVIDEOS: రోడ్డు మీద కారు.. కారు మీద శవం

Posted: 01/02/2016 03:09 PM IST
Driver travel 30 km with dead body

ఏంటీ ఏదొ ఫజిల్ అనుకుంటున్నారా..? కాదు కాదు దారుణమైన ఘటనకు సాక్షంగా నిలుస్తోంది ఓ శవం. హైవేల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసే వారు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అందరూ అనుకునేలా చేసింది ఈ ఘటన. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. నార్కెట్‌పల్లి శివారులోని శ్రీసాయి ఆకాంక్ష ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వెంకటరెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో వెంకటరెడ్డి ఎగిరి కారుపై పడ్డారు. అయితే కారు డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో.. అదే వేగంతో కారులో దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిపోయాడు.

రోడ్డు పక్కన ఉన్న స్థానికులు గమనించి కారును ఆపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే వెంకటరెడ్డి మృతి చెందాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే వృద్ధుడు మృతిచెందాడని స్థానికులు పేర్కొంటున్నారు. విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారుతి రిట్జ్ కారు(AP 09 BY2725) హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Car  Dear Body on car  nalgonda  nalgonda accident  

Other Articles