Sunny Leone becomes Google’s most-searched Indian of 2015, beats Salman Khan, PM Narendra Modi

Best of 2015 sunny leone tops google s most searched again

salman khan, sunny leone, shah rukh khan, Narendra Modi, deepika padukone, baahubali, bajrangi bhaijaan, most searched celebs, most searched actors, most searched actresses, most googled movies, most googled actors, most googled actresses, most googled celebs, srimanthudu, hamari adhuri kahani, roy, puli, pk, i, abcd 2, prem ratan dhan payo, akshay kumar, katrina kaif, aishwarya rai bachchan, priyanka chopra, poonam pandey, anushka sharma, alia bhatt, ajay devgn, amitabh bachchan, hrithik roshan

In the new age of information and technology, the popularity of celebrities has also gone digital. In Google's list of most searched actor

ప్రధాని వెనక్కు నెట్టి.. సల్మాన్ కన్న ముందుకు వచ్చిన సన్నీ

Posted: 12/17/2015 12:42 PM IST
Best of 2015 sunny leone tops google s most searched again

బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నీలి చిత్రాల సుందరి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో విడుదల కానున్న తన తదుపరి చిత్రంలో మొత్తంగా బికినీలతోనే కనిపించనుందని కొన్ని రోజుల నుంచి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కండోమ్ యాడ్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇలా అనేక విషయాలలో అమె జోక్యం చేసుకుని వివాదాలకు తెరతీయడంతో అమె తన పాపులారిటీని మరింత పెంచుకుంది. అయితే కేవలం వివాదాలతోనే కాకుండా తన అందచందాల అరబోత కూడా తన పాపులారిటీని మరింత పెంచిందని టాక్.

అదెలా అంటే.. గూగుల్ లో 2015 ఏడాదికి గానూ అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు సన్నీ లియోన్ కావడం విశేషం. ఏది ఏమైతేనేం, దేశంలోని రాజకీయ నాయకులు, నటీనటులు, ఇతర ప్రముఖ సెలబ్రిటీలను అందర్నీ సన్నీ వెనక్కి నెట్టేసింది. సన్నీ నటించిన కండోమ్ యాడ్ పై ఓ మహిళ కేసు పెట్టడం కూడా ఈ హాట్ స్టార్కు తలనొప్పిగా మారిన విషయం అందరికీ విదితమే. బాలీవుడ్ మూవీ 'ఎక్ పహేలీ లీలా'లో నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

ఎక్స్పోజింగ్ చేయడమే కాదు తనలో మంచి నటి దాగి ఉందని నిరూపించుకుంది సన్నీ లియోన్. అందుకే బిగ్ బీ అమితాబ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి అగ్రనటులను వెనక్కినెట్టి ఇంటర్నెట్ యూజర్లు రెండో సారి గూగుల్ సెర్చ్ ఇంజన్లో మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా నిలిచింది. హాట్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందున కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఆమె నటించిన మూవీ ‘మస్తీ జాదే’  త్వరలో విడుదల కానుంది. అయితే భారత ప్రధానిని ఏకంగా పదో స్థానానికి పరిమితం చేసింది. కాగా స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రం మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇండియన్ టాప్ టెన్ లిస్ట్:


* సన్నీ లియోన్
* సల్మాన్ ఖాన్
* ఏపీజే అబ్దుల్ కలామ్
* కత్రినా కైఫ్
* దీపికా పదుకొనే
* షారుక్ ఖాన్
* యో యో హనీ సింగ్
* కాజల్ అగర్వాల్
* అలియా భట్
* నరేంద్ర మోదీ

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Google's most searched  salman khan  Narendra Modi  

Other Articles