Finance Minister Lied,' Says Arvind Kejriwal After Arun Jaitley Denies CBI Raid

Finance minister lied in parliament says arvind kejriwal

arvind kejriwal, arvind kejriwal, cbi raids, delhi secretariat, arun jaitley, finance minister, kejriwal tweets, cbi, delhi, kejriwal office, venkaiah naidu, delhi principal secretary, cbi, delhi, kejriwal office, rajendra prasad delhi arvind kejriwal vs centre,Arvind Kejriwal,Arvind Kejriwal vs PM Modi,kejriwals office raided,Kejriwals office sealed, cbi, kejriwal cbi raid, cbi raid in kejriwal office, aap, aam aadmi party, bjp,

"FM lied in Parliament. My own office files are being looked into to get some evidence against me. Rajender is an excuse," tweeted Mr Kejriwal.

పార్లమెంటు సాక్షిగా ఆర్థికమంత్రి అబద్దాలు

Posted: 12/15/2015 05:12 PM IST
Finance minister lied in parliament says arvind kejriwal

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అబద్ధాలు ఆడారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన సొంత కార్యాలయంలో ఫైళ్లను చూస్తున్నారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. రాజేంద్ర కుమార్ అంశాన్ని సాకుగా పెట్టుకుని కేంద్రం.. తన అధికార దర్పంతో తన కార్యాలయంపై సిబిఐ సోదాలు జరిపిందని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో తన క్యాబినెట్ లోని ఓ మంత్రితో పాటు ఒక సీనియర్ అధికారిని కూడా అవినీతి అరోపణల నేపధ్యంతో తాను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇలా దేశంలో ఏ ముక్యమంత్ర చేయలేదన్ని చెప్పుకోచ్చారు. నిజంగా రాజేంద్ర కుమార్ కార్యాలయంపై దాడి చేయాలనుకున్న నేపథ్యంలో తనకు సిబిఐ ఎందుకు షేర్ చేసుకునేది కాదని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు అబద్దాలను చెబుతున్నారని ఆయన అరోపించారు. తన చాంబర్ లోనే పలు దస్త్రాలను పరిశీలించారని వెల్లడించిన కేజ్రీవాల్, ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ప్రధానికి ఏ ఫైల్ కావాలో చెబితే, తానే స్వయంగా వెళ్లి ఇస్తానని అన్నారు. రాజకీయ కుట్రలు జరుపుతూ, సీబీఐని ఉసిగొల్పడమేంటని ప్రశ్నించారు.

ఇక సీఎం కార్యాలయాన్ని సీజ్ చేయడంపై తాను షాక్ తిన్నానని, ఇలాంటిది ఇంతకు ముందెప్పుడూ లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్ చేయగా, దానికి సమాధానం ఇస్తూ.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందని కేజ్రీ అన్నారు. ఒకవేళ రాజేంద్రకుమార్ తన కార్యదర్శి కాకపోతే ఈ దాడులు జరిగేవా అని ప్రశ్నించి.. జరిగేవి కాదని తానే సమాధానం ఇచ్చారు. అప్పుడు టార్గెట్ ఎవరు.. రాజేందరా తానా అని మరో ప్రశ్న సంధించారు. 2002 సంవత్సరంలో షీలా దీక్షిత్ అవినీతి వ్యవహారం జరిగితే 2015లో కేజ్రీవాల్ మీద సీబీఐ దాడులు జరిగాయని.. 'వహ్.. మోదీజీ' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  cbi raids  delhi secretariat  arun jaitley  kejriwal tweets  

Other Articles