Beef-Pork festival row: BJP MLA arrested, 8 detained

Beef festival goshamahal mla rajasingh arrested

bjp mla raja singh, goshamahal mla raja singh, beef festival, osmania university, mla rajasingh arrested, bjp, telangana bjp president kishan reddy, trs, kcr, trs operation akarsh, sayanna, prabhakar, congress, TDP, raja singh TRS, raja singh kishan reddy,

Eight organisers of the controversial ‘beef festival’ on Osmania University campus were detained while BJP MLA T Raja Singh, who was opposing the the event, was arrested here this morning, police said.

బీఫ్ పెస్టివల్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా 18 మంది అరెస్టు..

Posted: 12/10/2015 09:15 AM IST
Beef festival goshamahal mla rajasingh arrested

హిందూయేతరులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తలపెట్టిన బీఫ్ పెస్టివల్ ను ఎట్టి పరిస్థుతుల్లో అడ్డుకుంటానని చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఛలో ఉస్మానియా యూనివర్సిటీకి పిలుపునిచ్చిన ఆయనను మంగళ్హాట్లోని ఆయన నివాసంలోనే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ  తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోబోమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసినా.. నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ప్రతినిధులు మాత్రం తమ పట్టువీడటం లేదు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క ఖాకీల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు.  అలాగే ఇతరులతో పాటు మీడియాకు కూడా క్యాంపస్ లోనికి అనుతమించడం లేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp mla raja singh  bjp  arrest  beef festival  osmania university  

Other Articles