KCR puts a condition to Danam Nagendar to join TRS| Telangana news

Kcr says danam to join trs under keshava rao leadership

Danam Nagendar, Danam TRS, Danam joins TRS, KCR condition to Danam to join TRS, Telangana news

Danam Nagendar has officially declared to join TRS party and to the shock, KCR had put a rare condition on the leader, for joining the party.

టీఆర్ఎస్ లో చేరికపై దానంకు కేసీఆర్ ఝలక్

Posted: 12/07/2015 09:29 AM IST
Kcr says danam to join trs under keshava rao leadership

రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి..  చేసేది మరోకటనే నానుడి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ కు సరిగ్గా సరిపోలుతుంది. ఇన్నాళ్లు తాను కాంగ్రెస్ పార్టీలోనే వుంటానని భీష్మించిన నేత.. గుట్టు చప్పుడు కాకుండా.. పార్టీ నుంచి పలాయనం చిత్తగిద్దామనుకున్నారు. అందుకనే బయట మీడియాకు మాత్రం తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పిన దానం.. అదే సమయంలో తన అనుచరగణానికి మాత్రమే తాను పార్టీ మారుతున్న విషయాన్ని చెప్పి.. కటౌట్లు సిద్దం చేయించుకున్నారు.

ఇక అంతా రెడ్డీ అనుకున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దానం నాగేందర్ కు ఝలక్ ఇచ్చారు. రెండు రోజుల వరకు కరువు ప్రభావిత ప్రాంతాలలో తిరిగి ప్రజల కష్టనష్టాలను తెలుసుకోనున్న ముఖ్యమంత్రి.. పార్టీలోకి చేరుందుకు సమయం కేటాయించాలని దానం అడగగానే.. తెలంగాణ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు సమక్షంలో పార్టీలో చేరమని ఝలక్ ఇచ్చారు. దీంతో పార్టీలోకి చేరేందుకు కటౌట్లు ఏర్పాట్లు చేసుకున్న దానం నాగేందర్ వాటిని హడావిడిగా వెనక్కు తీసివేయించారు.

ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో తానంటే పడని వాళ్లు పొమ్మనలేక పోగబెడుతున్నారని ఆరోపించిన దానం.. అక్కడితో ఆగకుండా.. పార్టీ నడపడం చేతకాని వాళ్లే కొందరు తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అటు కాంగ్రెస్ వారికి దానం ఇక తమ పార్టీలో వుండడు అనడానికి సాక్ష్యం లభించగా, దానం నాగేందర్ పరిస్థితే రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అటు కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించలేక ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ చేరికపై సందిగ్ధత ఏర్పడటంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వున్నారు దానం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam Nagendar  TRS  KCR  Telangana news  

Other Articles