4th Test: India in no mood of letting up despite series win

India 231 7 after day 1 against south africa

live cricket score, live score cricket, cricket live score, india vs south africa live, live ind vs sa, ind vs sa live, live ind vs sa, india south africa live, ind vs sa 4th test live score, ind vs south africa 4th test live score, ind vs sa 4th test match live score, india south africa 4th test live score, india south africa 4th test live score

India, after electing to bat first, got off to a slow start but the moment runs started coming the hosts lost wickets in a pack.

నెమ్మదిగా ఆడిన టీమిండియా.. సెంచరీకి చేరువలో రహానే..

Posted: 12/03/2015 07:38 PM IST
India 231 7 after day 1 against south africa

దక్షిణాఫ్రికాతో దేశరాజధాని డిల్లీ వేదికగా ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరుగుతున్న చివరిటెస్టులో టీమిండియా తొలిరోజు ఆటను నిదానంగా అఢింది. ఆటలో పైచేయి సాధించడంలో భాగంగా భారీ స్కోరు చేద్దామనుకున్నా.. అందుకు వీలు పడకుండా వరుస వికెట్లను కోల్పవడంతో.. అజింక్య రహానే మాత్రం రాణించి శతకానికి చేరువలో వున్నాడు. గురువారం ఆరంభమైన నాల్గో టెస్టులో అజింక్యా రహానే(89 బ్యాటింగ్;155 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడటంతో టీమిండియా ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తొలుత క్రీజ్ లో కుదురుకున్నంత వరకూ ఆచితూచి ఆడిన రహానే.. ఆ తరువాత తనదైన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో తడబడినట్లు కనిపించింది. తొలి సెషన్ లో వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసిన టీమిండియా.. లంచ్ తరువాత ఐదు కీలక వికెట్లను కోల్పోయింది.  శిఖర్ ధవన్(33), విరాట్ కోహ్లి(44)లు ఫర్వాలేదనిపించినా, మురళీ విజయ్(12),  చటేశ్వర పూజారా(14), రోహిత్ శర్మ(1), సాహా(1)లు  నిరాశపరచడంతో టీమిండియా టీ విరామంలోపే 139 పరుగులకు ఆరు వికెట్లను నష్టపోయింది.

ఆ సమయంలో రహానే-జడేజాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి  59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో  టీమిండియా తేరుకుంది. అయితే జడేజా(24) మంచి టచ్ లోకి వచ్చిన సమయంలో ఏడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత అశ్విన్-రహానేల జోడీ  తొలి రోజు ఆటలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. రహానే కు జతగా, అశ్విన్(6 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లో డేన్ పీడ్ట్ నాలుగు వికెట్లు సాధించగా, కేల్ అబాట్ కు మూడు వికెట్లు లభించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs south africa  delhi 4th test  ferozshah kotla stadium  

Other Articles