hero rana brother beats a person

Foreigners hit hero rana brother abhirams car

hero rana brother hulchul, hero rana brother abhiram, hero rana brother abhiram hulchul, abhiram hulchul, jubilee hills check post, jubilee hills police station, abhiram, hero rana, jublilee hills police station, foreigners

hero rana brother abhirams beats a foreigners as they hit his car and flew with out mentioning atleast sorry for him

రాణా తమ్ముడు అభిరామ్ కారును ఢీ కోన్న విదేశీయులు..

Posted: 11/29/2015 05:50 PM IST
Foreigners hit hero rana brother abhirams car

ప్రముఖ సినీ నటుడు రానా తమ్ముడు అభిరామ్ జూబ్లీహిల్స్ లో హల్ చల్ చేశాడు. తన కారును ఢీకొట్టి పరారైన వ్యక్తులను వెంబడించి మరీ పట్టుకున్నాడు. వారు ఎదురుతిరిగి వాగ్వాదానికి దిగడంతో వారిపై దాడికి పాల్పడ్డాడని సమాచరం. ఈ సంఘటనకు సంబంధించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ సంఘటనపై  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, చేసుకుని పోలీసులు కేసును నమోదు చేయనున్నారు. సిసిటీవీ ఫూటేజ్ అధారంగా అందిన ప్రాథమిక సమాచం మేరకు పోలీసులు చెప్పిన వివరాల ఇలావున్నాయి...

జూబ్లిహిల్స్ చౌరస్తాలో బైక్ పై వచ్చిన ఇద్దరు విదేశీయులు అభిరామ్ వస్తున్న కారు ముందు భాగానికి కొంచెం తగిలించారు. అయితే ఇతరులకు చెందిన కారును ఢీ కొన్న తరువాత కనీసం క్షమాగుణం కూడా లేని విదేశీయులు సారీ కూడా చెప్పకుండా వెళ్లారు. దీంతో కారులో నుంచి కిందకు దిగిన అభిరామ్, బైక్ ఢీకొట్టిన భాగాన్ని చూసిన అనంతరం ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో, వాళ్లను వెంబడించి పట్టుకున్నాడు. వారిని నిలవరింపజేసి కారును ఢీకొన్ని అలా ఎలా వెళ్తారని వారితో వాదానికి దిగాడు. ఇరువర్గాల మద్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో వారిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటనలో ముందు దాడికి పాల్పడిందెవరనే విషయమై, వారి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, మొదలైన విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abhiram  hero rana  jublilee hills police station  foreigners  

Other Articles