Jabalpur woman commits suicide over Aamir Khan's 'intolerance row'

Woman commits suicide after husband criticizes aamir khan

Bollywood actor aamirkhan, woman, commits, suicide, after, husband, criticizes, BJP leader satrghnasinha Aamir, mamatha benerjee aamir, Shahnawaz Hussain aamir, Wife suicide, aamir khan intolerance, West Bengal CM Mamata Banerjee

A dispute with her husband over remarks by Bollywood actor Aamir Khan saw a woman committing suicide by consuming poison, her family members claimed.

ఉసురు తీసిన ‘అసహనం’.. భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య

Posted: 11/27/2015 12:05 PM IST
Woman commits suicide after husband criticizes aamir khan

దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న అసహనంపై చర్చ ఓ మహిళ ఉసురు తీసింది. ముఖ్యంగా ఈ అంశంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమీర్ ఖాన్ అభిమానురాలైన భార్య.. తన భర్తతో గొడవపడి.. అది కాస్తా ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదానికి దారితీయడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ లో జరిగింది.

జబల్ పూర్ కు చెందిన అయాంక్ పాండే, సోనల్ పాండే దంపతుల మధ్య అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన చర్చ.. ముదిరి వ్యక్తిగతంగా తిట్టుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో మనోవేదనకు గురైన సోనల్ పక్క గది లోకి వెళ్లి లోపలినుంచి గడియ పెట్టుకుని విషం తాగిందని.. కాసేపటికి తలుపులు బద్దలు కొట్టి చూడగా సోనల్ అపస్మారక స్థితిలో పడి ఉందని అయాంక్ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamirkhan  Wife suicide  Jabalpur  madya pradesh  

Other Articles