Aamir Khan wife Kiran Rao is native of Telangana

Aamir khan wife kiran rao attachment with telugu state

aamir khan, kiran rao, telangana, grand father, vanaparthy kings, kiran rao is native of telangana, bangalore, bengaluru, kolkatta, mumbai, kiran rao grand father, kings dynasty, kiran rao pg mass communication, kiran rao asistant director, kiran rao produce, aamir kiran aazad

aamir khan wife kiran rao has a good attachment with telugu state as her grand father belongs to telangana

తెలుగింటి ఆడపడచు.. దేశం విడిచి వెళ్థామనిందా..?

Posted: 11/26/2015 04:27 PM IST
Aamir khan wife kiran rao attachment with telugu state

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అసహనం అంశంపై అందరిలా తాను మాట్లాడాలనుకున్నాడు. తమ తనయుడి భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించిన తాము ఆందోళన చెందామని చెప్పాడు. భవిష్యత్తులో తమ తనయుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి దేశం విడిచి వెళ్దామా అని అడిగి.. అంశాన్ని అగ్గి మీద గుగ్గిలంలా రేకెత్తించింది తెలుగింటి ఆడపడచు అంటే నమ్మశక్యంగా లేద కదూ. కానీ ఇదే నిజం. ఎందుకంటే బాలీవుడ్ అగ్రనటుడు అమిర్ ఖాన్ భార్య కిరణ్‌ రావు తెలుగింటి ఆడపడచు కాబట్టి.

’నా భార్య.. దేశం వదిలి వెళదామంటోంది’ అంటూ ఇటీవల ఆమీర్‌ చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టి కిరణ్‌రావుపైకి మళ్లింది. కిరణ్‌ రావుకు తెలంగాణతో దగ్గరి బంధమే ఉంది. కిరణ్‌ తాతగారు(తండ్రి వైపు) మహబూబ్‌నగర్‌లోని వనపర్తి రాజవంశీకులు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన కిరణ్‌ తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరు, కోల్‌కతా, ముంబైల్లో పనిచేశారు. దీంతో కిరణ్‌ విద్యాభ్యాసం కూడా కోల్‌కతా, ముంబైలలో సాగింది.

కోల్‌కతాలోని లొరెటో హౌస్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన కిరణ్‌ ఎకనామిక్స్‌ డిగ్రీని ముంబైలోని సోఫియా కళాశాల నుంచి తీసుకొన్నారు. అనంతరం మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి పొందారు. సినీరంగంపై ఉన్న ఆసక్తితో అశుతోష్‌ గోవర్కిర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరిన కిరణ్‌.. ఆమీర్‌ఖాన్‌ నిర్మించిన లగాన్‌కు పనిచేశారు. ఆ సమయంలో ఆమీర్‌తో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. 2002లో ఆమీర్‌ తన తొలి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి కిరణ్‌రావును పెళ్లి చేసుకొన్నారు.

వీరికి ఆజాద్‌ అనే బాబు ఉన్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు అబుల్‌ కలాం ఆజాద్‌ పేరు మీదుగా తన కొడుకుకు ఆజాద్‌ అని పేరు పెట్టినట్లు కిరణ్‌ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా అమిర్ ఖాన్ చుట్టూ పెద్ద వివాదమే రాజకుంటున్న నేపథ్యంలో అసలు దానికి అజ్యం పోసింది కూడా తెలుగింటి ఆడపడచని ఎంత మింది తెలుసు. అయితే తెలుగింటి ఆడపడుచుకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. తెలుగు వారు మాత్రం ఏం చేయగలరు. దేశానికి సంబంధించిన అంశం కాబట్టే కిమ్మనకుండా వున్నారు. అసలు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా అని అవాక్కయిన వాళ్లు ఉన్నారు. వనసర్తి రాజకుటుంబానికి చెందిన కిరణ్ రావు నోట ఇలాంటి మాటలా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్లూ లేకపోలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  kiran rao  telangana  grand father  vanaparthy  

Other Articles

 • Ap high court directs ys jagan govt to maintain status quo in amaravati till february 26

  ప్రభుత్వ కార్యాలయాలు తరలించవద్దు: హైకోర్టు ఆదేశం

  Jan 23 | మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై విషయమై దాఖలైన పిటీషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యంను రాష్ట్రోన్నత న్యాయస్థానం... Read more

 • Tihar jail authorities ask nirbhaya convicts about their last wish

  ‘నిర్భయ’ దోషుల చివరి కోరిక ఏమిటి.?

  Jan 23 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు తేదీ ఖరారై.. సమీపిస్తున్న నేపథ్యంలో దోషుల చివరి కోరిక తీర్చేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాటు చేశారు. నిందితులు వున్న బ్యారక్... Read more

 • Centre did not approve three capitals proposal pawan kalyan

  బీజేపితో కలసి ‘లాంగ్ మార్చ్’కు జనసేన పిలుపు

  Jan 23 | వైసీపీ నేతలు వారి భూ దందాల కోసమే రాజధానిని మార్చాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అరోపించారు. వైసీపీ నేతలు వారి స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన అరోపించారు. రాజధానిగా అమరావతిని... Read more

 • Former village sarpanch beaten up by locals after he attempts to sexually assault minor

  మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచార యత్నం.. దేహశుద్ది

  Jan 23 | మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మాజీ సర్పంచ్ ను గ్రామప్రజలు దేహశుద్ది చేసిన ఘటన ఇది. తాత వయస్సున మానవమృగం మనవరాలి వయస్సు వున్న బాలికపై అఘాయిత్యానికి యత్నించడంతో బాలిక బంధువులు చావచితకకొట్టారు. అభం... Read more

 • Chennai police in search of a mysterious women s underclothing thief

  సైకో దొంగ: మహిళల లోదుస్తులు, కాస్మోటిక్స్ మాత్రమే..

  Jan 23 | తమిళనాడు రాజధాని అడంబక్కుంలో ప్రాంతంలోని కోవైలో ఓ వింతదొంగ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సాధారణంగా దొంగలు డబ్బు దస్కం కోసం సులువుగా తమ పూట గడవటం కోసం దొంగతనాలు చేస్తుంటారే కానీ ఈ వింతదొంగ మాత్రం... Read more

Today on Telugu Wishesh