Farmington UConn Health Center ordered to pay compensation

Hospital authorities ordered to pay compensation to vasectomy patient

Farmington UConn Health Center, UConn Health Center negligence, copurt orders compensation, compensation to vasectomy patient, famington, Uconn Health center, compensation, vasetomy patient, doctors negligence

court orders Farmington UConn Health Center to pay compensation to vasectomy patient who suffered for doctors negligence

అపరేషన్ చేయించుకున్న ఆ వ్యక్తికి 2.5 కోట్లు చెల్లింపు..! ఎందుకో తెలుసా..?

Posted: 11/26/2015 04:25 PM IST
Hospital authorities ordered to pay compensation to vasectomy patient

ఆపరేషన్‌ కోసం వచ్చిన ఓ పేషెంట్‌ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు.. అందుకు భారీ మూల్యం చెల్లించనున్నారు. వెసక్టమీ ఆపరేషన్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి వృషణాన్ని గాయపరిచి.. మూడు నెలలపాటు అతను నరకయాతన అనుభవించేలా చేశారు. అతను కోర్టును ఆశ్రయించడంతో.. 2.5 కోట్లు నష్టపరిహారంగా చెల్లించవలసిందిగా సదరు హాస్పిటల్‌ను జడ్జి ఆదేశించారు. ఫార్మింగ్‌టన్‌లోని యూకాన్‌ హెల్త్‌ సెంటర్‌కు 2013లో ఓ 42 ఏళ్ల వ్యక్తి ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ (వెసక్టమీ) కోసం వచ్చాడు. అతనికి ఆపరేషన్‌ చేస్తున్న క్రమంలో వృషణానికి రక్తం సరఫరా చేసే నాళాలను కత్తిరించేసి ఇంటికి పంపించేశారు అక్కడి వైద్యులు.

అనంతరం వృషణాల్లో విపరీతమైన నొప్పి రావడంతో ఆ వ్యక్తి వేరే హాస్పిటల్‌కు వెళ్లాడు. వృషణాలకు రక్తం సరఫరా చేసే నాళాలను కత్తిరించేశారని, వృషణాన్ని తొలగించాల్సిందేనని అక్కడి వైద్యుడు చెప్పాడు. దాంతో చేసేదేం లేక వృషణాన్ని తొలగించుకున్న ఆ వ్యక్తి యూకాన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్వాకంపై కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు ఇటీవల విచారణకు రావడంతో జడ్జి కేసును పరిశీలించి సదరు హాస్పిటల్‌ను దోషిగా తేల్చారు. యూకాన్‌ హాస్పిటల్‌ ఆ వ్యక్తికి దాదాపు 2.5 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : famington  Uconn Health center  compensation  vasetomy patient  doctors negligence  

Other Articles