delhi cm arvind kejriwal has given clarification on hug with lalu prasad yadav in nitish oath event | kejriwal controversies

Delhi cm arvind kejriwal clarification on hug with lalu prasad yadav

arvind kejriwal, kejriwal hug with lalu prasad yadav, lalu prasad controversy, lalu prasad with kejriwal, nitish kumar oath, nitish kumar controversy

delhi cm arvind kejriwal clarification on hug with lalu prasad yadav : delhi cm arvind kejriwal has given clarification on hug with lalu prasad yadav in nitish oath event.

‘నేను వద్దనుకున్నా.. ఆయనే లాక్కొని కౌగిలించుకున్నారు’

Posted: 11/23/2015 06:43 PM IST
Delhi cm arvind kejriwal clarification on hug with lalu prasad yadav

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం వేడుకలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌగిలించుకొని కనిపించిన దృశ్యం పెను దుమారానికే దారి తీసింది. దాణా కుంభకోణంలో శిక్షపడిన కళంకిత నేత లాలూను ఎలా కౌగిలించుకుంటారని సొంత పార్టీ ఆప్‌ నేతలే కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం సొంత పార్టీ నేతలే కాదు.. ఇతర పార్టీల నేతలూ కూడా విమర్శలు చేశారు. ఇక ఘాటు వార్తల కోసం ఎదురుచూసే మీడియా కూడా వారి కౌగిలింత దృశ్యంపై రకరకాల వార్తలు రాసేసింది. ‘నీతితో అవినీతి కౌగిలించుకున్న వేళ’ అంటూ ట్యాగ్ లైన్లు పెట్టి మరీ వార్తలు ప్రచురించారు. తనపై వస్తున్న ఈ విమర్శల దాడినుంచి తప్పించుకోవడానికి చివరికి కేజ్రీవాల్ ఆ వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

సోమవారం జరిగిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘నితీశ్‌జీ ప్రమాణ స్వీకారోత్సవంలో లాలూ యాదవ్ నాతో కరచాలనం చేశారు. అంతటితో ఆగకుండా నన్ను లాక్కొని ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయంలో నేనుగా ఎలాంటి చొరవ తీసుకోలేదు’ అంటూ వివరణ ఇచ్చారు. అవినీతి రికార్డు కలిగిన లాలూకు మేం వ్యతిరేకమని, ఈ విషయంలో ఆయనను ఎప్పుడూ వ్యతిరేకిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిజానికి తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, పట్నాలో జరిగింది వారసత్వ రాజకీయమేనని, లాలూ ఇద్దరు తనయులు నితీశ్‌ కేబినెట్‌లో చోటు సంపాదించారని చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  lalu prasad yadav  nitish kumar  

Other Articles