AAM MLA abuse police officer

Aam mla abuse police officer

AAP, MLA, Sarita Singh, Police man, Om Pal, Kejriwal, AAP MLA Sarita Singh, case on Sarita Singh

An Aam Aadmi Party MLA was booked on Sunday night for allegedly misbehaving with a police official on duty in northeast Delhi's Rohtash Nagar area, a charge denied by the legislator. According to the police, legislator Sarita Singh's driver allegedly hit the police official's motorbike while reversing his car.

ITEMVIDEOS: పోలీస్ ను తిట్టిన మహిళా ఎమ్మెల్యే

Posted: 11/23/2015 01:33 PM IST
Aam mla abuse police officer

ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే చాలు తమ ప్రతాపం ఎవరి మీదైనా చూపించుకోవచ్చు అన్న విధంగా చాలా మంది ప్రవర్తిస్తుంటారు. తాము ప్రజాప్రతినిధులమని.. పది మందికి ఆదర్శంగా ఉండాలన్న ధ్యాస లేకుండా ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిసుంటారు. చివరకు జనాల చేత నాలుగు తిట్లు తిట్టుంచుకొని క్షమాపణాలు చెబుతుంటారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అసిస్టెంట్ ఇన్సెక్టర్ ను తిట్టిపోసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మా ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి వదలేస్తున్నా.. లేదంటేనా??? అంటూ అతడికి హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువ మాట్లాడవద్దని.. నోరు మూసుకొమ్మని గద్దించింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఏంటా మ్యాటర్ అనుకుంటున్నారా.? అయితే మొత్తం స్టొరీ చదవండి.

దిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో విమర్శలపాలవుతోంది. దిల్లీలో ఓ ఫంక్షన్ కోసం భద్రత కోసం వచ్చిన ఏఎస్సై ఓంపాల్ తన డ్యూటీలో ఉన్నారు. పార్కింగ్ వద్ద తన పోలీస్ వాహనం మీద కూర్చొని ఉండగా.. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సరితా సింగ్ కార్ రివర్స్ లో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో దాని మీదున్న పోలీస్ కు కూడా గాయాలయ్యాయి. అయితే ఇదేంటని ప్రశ్నించిన ఆ పోలీస్ అధికారి మీదకు ఎమ్మెల్యే సరితా సింగ్ మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడవద్దని.. తాను పెళ్లికి వచ్చాను కాబట్టి వదిలేస్తున్నాను.. లేదంటే అంటూ గద్దించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా దీని మీద స్పందించిన ఆమె మొత్తం వీడియోను పెట్టలేదని.. కొంత భాగం మాత్రమే పెట్టారని అంటోంది. పైగా ఆ పోలీస్ అధికారి ఏం మాట్లాడారో వీడియోలో చూపించలేదని అన్నారు. అయినా అమ్మగారికి కోసం వస్తే ఇష్టంవచ్చినట్లు తిట్టెయ్యడం ఏంటీ అంటూ జనాలు విమర్శిస్తున్నారు.

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  MLA  Sarita Singh  Police man  Om Pal  Kejriwal  AAP MLA Sarita Singh  case on Sarita Singh  

Other Articles