kidnaped TRS leaders released by maoists

Abducted six trs leaders freed by maoists

Maoists, jagan, kidnap, TRS leaders, Bhadrachalam, Khammam, Maoist spokesperson jagan, Bhadrachalam assembly constituency TRS leaders, TRS in-charge Mane Ramakrishna, Charla mandal leaders, Venkateswarlu, Ramakrishna, Suresh, Vajedu mandal leaders Janardhan, Satyanarayana, Punuguppa tribal region, Bhadrachalam Division, Khammam district

All the six TRS leaders, who had been kidnapped by Maoists three days ago, have been freed unconditionally, early this morning.

మావోల చెర నుంచి విడుదలైన టీఆర్ఎస్ నేతలు

Posted: 11/21/2015 11:41 AM IST
Abducted six trs leaders freed by maoists

గడిచిన 48 గంటల వ్యవధి నుంచి మావోల చెర వున్న టీఆర్ఎస్ నేతలు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్ల అటవీ ప్రాంతంలో ఆరుగురు టీఆర్ఎస్ నేతలను మావోలు వదిలేశారు. రెండు రోజుల క్రితం భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు అపహరించుకు వెళ్లారు. నకీలీ ఎన్ కౌంటర్లను నిలిపివేయాలని, అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూంబింగ్ ను అపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ కిడ్నాప్ నేపథ్యంలో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ కూడా విడుదల చేశారు.
 
బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నేడు నెత్తుటి తెలంగాణను చేశారని, తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని మావోయిస్టులు మండిపడ్డారు. ప్రభుత్వానికి కనువిప్పు చేయడానికే నేతలను కిడ్నాప్ చేసినట్లు మావోయిస్టులు తెలిపారు. మావోలపై భౌతికదాడులకు పాల్పడితే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తామన్నారు. తమ డిమాండ్లను అంగీకరించకపోతే టీఆర్ఎస్ పార్టీ నేతలనే డిమాండ్ చేస్తామని లేఖలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అపహరణకు గురైన టీఆర్ఎస్ నేతల కుటుంబాల్లో తీవ్ర అందోళన నెలకొంది. తమ వారిని మావోలు ఎలాంటి హాని తలపెట్టకుండా క్షేమంగా వదిలివేయాలని కోరారు. అయితే వారి ప్రార్థనలు ఎట్టకేలకు ఫలించాయి. వారి మొరను ఆలకించిన మావోలు.. తమ చెరలో వున్న ఆరుగురు టీఆర్ఎస్ నేతలను ఇవాళ తెల్లవారుజామున వదిలిపెట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  jagan  kidnap  TRS leaders  Bhadrachalam  Khammam  

Other Articles