బారత్ లో హింసకు పాకిస్థాన్ కుట్ర.. నిధుల సేకరణ

Pakistan collecting funds to encourage attacks on an india

పాకిస్థాన్, ఇండియా, బారత్, బారత్-పాకిస్థాన్, పాకిస్థాన్ దాడి, భారత్ పై పాక్, India, Pakistan, ISI, Pakistan on India, India on Pakistan, pakistan Media, Pakistan Attack on India, pakistan as Anty-Indian policy

భారత్ మీద ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్.. బారత్ లో హింసను ప్రేరేపించేందుకు నిధులను పోగేస్తోందని బారత వర్గాలు తేటతెల్లం చేశాయి.

బారత్ లో హింసకు పాకిస్థాన్ కుట్ర.. నిధుల సేకరణ

Posted: 11/19/2015 06:06 PM IST
Pakistan collecting funds to encourage attacks on an india

భారత్ లో దాడులకు పాకిస్థాన్ హస్తం ఉంటుందని.. బారత్ లో జరిగే హింసకు పాకిస్థాన్ ప్రత్యక్షంగానో లేదంటే పరోక్షంగానో సహకరిస్తుందని అందరికి తెలుసు. తాజాగా మరోసారి బారత్  లో హింసకు పాల్పడేందుకు పాకిస్థాన్ చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం నిధులు సమకూర్చేందుకు పాకిస్తాన్‌-కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఎత్తున విరాళాలు సేకరిస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో పాకిస్తాన్ లోని వివిధ వర్గాల నుంచి ఆ ఉగ్రవాద గ్రూపు రూ. 80 కోట్లకు పైగా విరాళాలు వసూలు చేసిందని భారత దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

 భారత్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్ఎం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గత ఎనిమిదేళ్లలో ఆ సంస్థ  80 కోట్లు వసూలు చేసింది  అని అధికారులు పారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు నివేదించారు.  భారత్ కు ఈ నిధులు చేరగానే వీటిని వివిధ మార్గాల ద్వారా మళ్లించి క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదులు, మరణించిన హిబ్బుల్ ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు అందజేస్తారు  అని టాస్క్ ఫోర్స్‌ కు నివేదించారు. విదేశాల్లో కూడా నిధులు సేకరించి, తమ ముసుగు సంస్థలకు ఆ సొమ్మును చేరవేస్తున్నారని భారత దర్యాప్తు అధికారుల వెల్లడించారు. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాదుల యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నదని, తన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కన్నుసన్నల్లోనే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయని భారత్‌ ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. అయినా  కూడా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పాకిస్థాన్ వైఖరిలో కూడా ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles