accused haragopal sentenced to jail for 10 years

Accused convicted in forcibily kissing case

nalanda high school, student, kiss, accused haragopal, sentenced to jail, Nampally city civil court, haragopal sentenced for 10 yrs jail, forcibily kissing a girl student

nalanda high school clerk haragopal sentenced for 10 yrs jail for forcibily kissing a girl student

బలవంతంగా ముద్దు పెట్టాడు.. ఇలా ఇరుకున్నాడు..!

Posted: 11/13/2015 08:01 AM IST
Accused convicted in forcibily kissing case

పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన ఓ కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. విద్యార్థినిని బలవంతంగా ముద్దు పెట్టుకున్న కేసులో నిందితుడికి న్యాయస్థానం 10 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. దీంతో పాటు రూ.5వేల జరిమానా విధించిందని ఎస్‌ఆర్‌నగర్ ఇన్స్‌పెక్టర్ పి.సతీష్ తెలిపారు. వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో క్లర్క్‌గా పనిచేసే హరగోపాల్ డిసెంబర్ 2014న పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.

బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లర్క్ హరగోపాల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. 376, పోక్స్‌యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. 11 నెలల వ్యవధి పాటు విచారణ జరిపిన నాంపల్లి సిటీసివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెలువరించారు. విద్యార్థి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారని ఇన్స్‌పెక్టర్ తెలిపారు. 1వ తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్ కేసును విచారించి అతడికి పదేళ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  kiss  accused haragopal  sentenced to jail  

Other Articles