ap police has issued lookout notice to catch main accused sai srinivas in krupamani suicide case | krupamani suicide selfie video controversy

Police issued lookout notice to catch main accused in krupamani suicide case

krupamani suicide case, gudala sai srinivas, krupamani family members, ap cm chandrababu naidu, ap police investigation on krupamani suicide case, krupamani husband

police issued lookout notice to catch main accused in krupamani suicide case : ap police has issued lookout notice to catch rowday sheeter gudala sai srinivas who is main accused in krupamani suicide case

కృపామణి ‘కీచకుడి’పై లుకౌట్ నోటీసు

Posted: 11/02/2015 11:34 AM IST
Police issued lookout notice to catch main accused in krupamani suicide case

ఆమె ఓ ఇల్లాలు.. తన భర్త, బిడ్డతో సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఓ చిన్న గొడవ వారిద్దరిని విడదీసింది. అదే ఆ గృహిణికి శాపంగా మారింది. తమ ఇంటికి తీసుకెళ్లిని ఆ ఇల్లాలు కుటుంబసభ్యులు ఆమెపై వ్యభిచారం చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అందుకు ఓ రౌడీ షీటర్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. దాంతో తీవ్రంగా కుంగిపోయిన ఆమె.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నిందితుల వివరాల్ని బట్టబయలు చేసింది. వారిలో అందరిని అదుపులోకి తీసుకోగా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన కీచకుడు మాత్రం ఇంతవరకు దొరకలేదు. ఇంతలోనే అతగాడు విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నాడని తెలియగా.. అతడిని నిలువరించేందుకు ఏకంగా లుకౌట్ నోటీసులను జారీ చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి అనే మహిళకు కొంతకాలం క్రితమే వివాహమైంది. సంతోషంగా గడుపుతున్న వీరి దాంతప్య జీవితంలో ఓ చిన్న తగాదా ఏర్పడింది. దాంతో కృపామణి తల్లిదండ్రులు ఆమె భర్తపై కేసు పెట్టించగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక పుట్టింటికి వెళ్లిన కృపామణి అక్కడే కొన్నాళ్లు సుఖంగానే గడిపింది కానీ.. ఇంతలోనే కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల్లో తీవ్రంగా కూరుకుపోయిన తాము ఆ సమస్య నుంచి బయటపడాలంటే వ్యభిచారం చేయాల్సిందేనని కృపామణిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు వేధించడం మొదలుపెట్టారు. అందుకు ఆమె ఒప్పుకోకపోయినప్పటికీ.. బలవంతంగా చేయించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గుడాల సాయి శ్రీనివాస్ అనే రౌడీ షీటర్ కృపామణిపై నెలలపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందుకుగాను అతగాడు ఆమె తల్లిదండ్రులకు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పాడు. ఈ నేపథ్యంలోనే తన భర్త జైలు నుంచి విడుదలకాగా.. వెంటనే కృపామణి అతని దగ్గరికి వెళ్లిపోయింది. అప్పటికీ ఆ రౌడీ షీటర్ ఈమె వెంటపడుతూ తన కామవాంఛ తీర్చాల్సిందేనని, లేకపోతే మొత్తం విషయాన్ని భర్తకు చెప్పేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఇతనికి ఆమె కుటుంబసభ్యులు కూడా మద్దతు పలికారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు.. సూసైడ్ నోట్ రాయడంతోపాటు తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించడంతో పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. పరారీలో వున్న కృపామణి కుటుంబసభ్యుల్ని గాలింపు చర్యలు చేపట్టి ఎలాగోలా పట్టుకోగలిగారు. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ శ్రీనివాస్ ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. కేసు వెలుగు చూసినప్పటి నుంచి పరారీలో వున్న అతగాడు.. తాజాగా విదేశాలకు చెక్కేసేందుకు యత్నిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles