actress kasturi promoting cancer awareness

Actress poses seminude for motherhood project

popular actress Kasthuri, kasthuri posing seminude, kasthuri with her kid for The Bodies of Mothers photography, kasthuri project to highlight motherhood, Actress Kasthuri Poses Seminude for The Bodies of Mothers Project, A Beautiful Body Project: The Boosters is Mothers Project by Jade Beall, Kasthuri Semi Nude Photo shoot for The Bodies of Mothers Photography

popular actress Kasthuri posing seminude with her kid for The Bodies of Mothers photography project to highlight motherhood.

ITEMVIDEOS: అర్థనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చి.. అందరి మెప్పు పొందిన నటి

Posted: 11/01/2015 12:29 PM IST
Actress poses seminude for motherhood project

దక్షిణభారత చలనచిత్ర ప్రేక్ష్కులకు సుపరిచితురాలైన ప్రముఖ నటి కస్తూరి అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు ఒక చంటి బిడ్డను గుండెలకు హత్తుకున్నట్లు ఫోటోలు దిగారు. సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనబడే ఈ అమ్మాడి ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కస్తూరి చేసిన ఈ సంచలన పనితో అభిమానులు హర్ట్ అయినా.. విషయం తెలసి ఔరా..! అంటున్నారు. తమిళంలో ఆత్తా ఉన్‌కోయిలిలే చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసి చిన్నవర్, సెంతమిళ్‌పాట్టు తదితర చిత్రాల్లో నటించారు.

కార్తీక్, ప్రభు, ప్రశాంత్ తదితర నటులకు జంటగా నటించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ అన్నమయ్య వంటి పలు చిత్రాల్లో నటించారు. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్న కస్తూరి ఆ మధ్య నాంగ చిత్రం ద్వారా రీఎంట్రీ అయ్యారు. అయితే రీఎంట్రీ ఆమెను కథానాయికగా నిలబెట్టలేక పోయింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. తాజాగా ఒక పుస్తకానికి అర్ధనగ్న పోజు లిచ్చి వార్తల్లోకెక్కారు. అమెరికాకు చెందిన జెడ్ అనే నిశ్చల ఛాయాగ్రహకుడు గర్భిణి స్త్రీల సమస్యలు, ప్రసవం అనంతరం గురయ్యే సుఖ వ్యాధులు క్యాన్సర్, గర్భసంచి సమస్యలు ఇత్యాది విషయాలపై అవగాహన కలిగించేలా ఏ బ్యూటీపుల్ ప్రాజెక్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించనున్నారు.

ఈ పుస్తకం కోసం కస్తూరి అర్ధ నగ్న పోజులిచ్చారట.దీని గురించి ఆమె తెలుపుతూ మంచి ప్రయత్నం కోసం తన ఇమేజ్ బాధింపుకు గురవతుందన్న అంశాన్ని కూడా పక్కన పెట్టి అర్ధనగ్న పోజులిచ్చానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడనున్న ఈ పుస్తకం లో కస్తూరిలా మరో 80 మంది సెలబ్రిటీలు స్త్రీల ఈ తరహా పోజులతో కూడిన ఫోటోలు ఆ పుస్తకంలో చోటు చేసుకుంటాయట. అయితే మహిళలలో వచ్చే కాన్సర్ తదితర వ్యాధుల అవగాహనకు కూడా ఈ పుస్తకాన్ని అంతర్జాతీయంగా అందుబాటులో వుంచనున్నారని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kasturi  actress  cancer  seminude  

Other Articles